Kantara Telugu Collections: సండే మాస్ కుమ్ముడు.. 16 రోజుల్లో సంచలనంగా.. లాభాలే అన్ని కోట్లా!

ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిలో విశ్వవ్యాప్తం అయిపోయింది. దీంతో మన ఇండస్ట్రీపై ఎంతో మంది ఫోకస్ చేస్తున్నారు. పెద్ద మార్కెట్ ఉండడంతో తెలుగులో తమ తమ చిత్రాలను విడుదల చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు విడుదలై.. భారీ విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన మరో సినిమా 'కాంతార'. కన్నడంలో రూపొందిన ఈ మూవీ కొద్ది రోజుల క్రితమే తెలుగులోకి వచ్చింది. దీనికి ఇక్కడ వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 16 రోజుల రిపోర్టును మీరే చూడండి!

తెలుగులో కాంతార ఊచకోత

తెలుగులో కాంతార ఊచకోత


ప్రముఖ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి నటించి, రూపొందిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది కన్నడంలో విడుదలైనా తెలుగులో అక్టోబర్ 15న గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

తెలుగులో బిజినెస్ వివరాలు

తెలుగులో బిజినెస్ వివరాలు


గత నెలలోనే కన్నడంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసింది.

16వ రోజు తెలుగు వసూళ్లిలా

16వ రోజు తెలుగు వసూళ్లిలా


16వ రోజు 'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 1.88 కోట్లు షేర్, రూ. 3.40 కోట్లు గ్రాస్ వసూలైంది.

16 రోజుల్లో ఎంత వచ్చింది?

16 రోజుల్లో ఎంత వచ్చింది?


'కాంతార'కు 16 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.62 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.59 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.02 కోట్లు, గుంటూరులో రూ. 1.33 కోట్లు, కృష్ణాలో రూ. 1.30 కోట్లు, నెల్లూరులో రూ. 79 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 20.94 కోట్లు షేర్, రూ. 38.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?


చాలా కొత్త కాన్సెప్టుతో వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 20.94 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 18.64 కోట్లు లాభాలు వచ్చాయి.

20 కోట్లతో మరో గొప్ప రికార్డు

20 కోట్లతో మరో గొప్ప రికార్డు

విభిన్నమైన సబ్జెక్టుతో వచ్చిన 'కాంతార' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే 16 రోజుల్లోనే ఈ సినిమా రూ. 20.94 కోట్లు షేర్ వసూలు చేసింది. తద్వారా రూ. 20 కోట్ల మార్కును దాటిన అతి తక్కువ డబ్బింగ్ చిత్రాల జాబితాలో చేరి రికార్డు నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X