Kantara Telugu Collections: తెలుగులో పెను సంచలనం.. 17వ రోజూ భారీగానే.. మరో 50 లక్షలు వస్తే రికార్డే

సరికొత్త కాన్సెప్టులతో వచ్చే సినిమాలను దక్షిణాది ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారన్న విషయం తెలిసింది. ఇది 'కాంతార'తో మరోసారి నిరూపణ అయింది. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొందిన ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అంతేకాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తెలుగులో డబ్బింగ్ అయిన 'కాంతార' పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం కేవలం 17 రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 17 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

తెలుగులో కాంతార సెన్సేషన్

తెలుగులో కాంతార సెన్సేషన్


కన్నడ పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది తెలుగులో కాస్త ఆలస్యంగా అంటే అక్టోబర్ 15న విడుదలైంది.

తెలుగులో బిజినెస్ వివరాలు

తెలుగులో బిజినెస్ వివరాలు


ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి కన్నడంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో అత్యధిక థియేటర్లలో వదిలారు.

 17వ రోజు తెలుగు వసూళ్లిలా

17వ రోజు తెలుగు వసూళ్లిలా


'కాంతార' మూవీకి 17వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 48 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 93 లక్షలు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

 17 రోజుల్లో ఎంత వచ్చింది?

17 రోజుల్లో ఎంత వచ్చింది?


17 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.58 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.66 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.05 కోట్లు, గుంటూరులో రూ. 1.38 కోట్లు, కృష్ణాలో రూ. 1.36 కోట్లు, నెల్లూరులో రూ. 81 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 21.87 కోట్లు షేర్, రూ. 39.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?


వైవిధ్యమైన కథతో రూపొందిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 21.87 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 19.57 కోట్లు లాభాలు వచ్చాయి.

 మరో యాభై లక్షలు వస్తే..

మరో యాభై లక్షలు వస్తే..


క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కిన 'కాంతార' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇక, ఈ సినిమాకు మరో యాభై లక్షలు రూపాయలు వస్తే.. నలభై కోట్ల మార్కును చేరడంతో పాటు రూ. 20 కోట్ల లాభాలను సొంతం చేసుకుంటుంది. ఇదే జరిగితే పెను సంచలనం నమోదు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X