Kantara Telugu Collections: గాడ్ ఫాదర్ రికార్డు సమం చేసిన కాంతార.. అన్ని కోట్ల లాభాలతో సంచలనం
రెండు మూడు వారాలుగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సినిమాల్లో 'కాంతార' ఒకటి. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా చాలా భాషల్లో విడుదల కూడా అవుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితమే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి మన దగ్గర కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అలాగే, ఒకే రేంజ్‌లో వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'కాంతార' వారం రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

సంచలనంగా మారిన కాంతార
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ అయింది.

తెలుగులో బిజినెస్ వివరాలు
సెప్టెంబర్ 30వ తేదీన కన్నడంలో విడుదలైన ఘన విజయాన్ని అందుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సంస్థ సొంతం చేసుకుని.. ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసింది.

7వ రోజు తెలుగు కలెక్షల్లు ఇలా
'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7వ రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 27 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 65 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

వారం రోజుల్లో ఎంతొచ్చింది?
వారం రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.47 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 93 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, గుంటూరులో రూ. 73 లక్షలు, కృష్ణాలో రూ. 70 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 11.37 కోట్లు షేర్, రూ. 21.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 11.37 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.07 కోట్లు లాభాలు దక్కాయి.

గాడ్ ఫాదర్‌ను సమం చేసింది
క్రేజీ సబ్జెక్టుతో వచ్చిన 'కాంతార' మూవీ తెలుగులో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది వరుసగా ఆరు రోజుల పాటు కోటి రూపాయల కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఫలితంగా భీమ్లా నాయక్, బింబిసార, గాడ్ ఫాదర్ (ఇవన్నీ ఆరు రోజులు కోటికి పైగా రాబట్టాయి) చిత్రాలను సమం చేసింది. అంతేకాదు, భారీ లాభాలతో సంచలన రికార్డును నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











