Kantara Telugu Collections: కాంతార సంచలన రికార్డు.. 2 కోట్లకు కొంటే.. అన్ని కోట్ల లాభాలతో అరాచకం
గతంలో కంటే ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోని ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. దీంతో కొత్త కాన్సెప్టులతో వచ్చే సినిమాలను వాళ్లు బాగా ఇష్టపడుతున్నారు. ఫలితంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ ప్రయోగాత్మక సినిమాలు రూపొందుతోన్నాయి. ఇలా వచ్చిన చాలా మూవీలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రం 'కాంతార'. రెండు వారాల క్రితమే తెలుగులోకి కూడా వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 2 వారాల రిపోర్టును మీరే చూడండి!

తెలుగులో కాంతార అరాచకం
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది కన్నడంలో విడుదలైనా తెలుగులో అక్టోబర్ 15న డబ్బింగ్ అయింది.

తెలుగులో బిజినెస్ వివరాలు
సెప్టెంబర్ 30వ తేదీన కన్నడంలో విడుదలై బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేసింది.

14వ రోజు తెలుగు వసూళ్లిలా
14వ రోజు 'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 43 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలైంది.

14 రోజుల్లో ఎంత వచ్చింది?
2 వారాల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.37 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 89 లక్షలు, గుంటూరులో రూ. 1.15 కోట్లు, కృష్ణాలో రూ. 1.15 కోట్లు, నెల్లూరులో రూ. 70 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.43 కోట్లు షేర్, రూ. 31.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 17.43 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 15.13 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

తెలుగులో మరో సంచలనం
కన్నడంలో భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార' మూవీకి తెలుగులో కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం తాజాగా తెలుగులో రూ. 15 కోట్ల లాభాల మార్కును కూడా చేరుకుంది. తద్వారా ఎక్కువ లాభాలు అర్జించిన డబ్బింగ్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.


Click it and Unblock the Notifications











