Kantara Telugu Collections: తెలుగు కాంతారా.. 20 రోజుల్లోనే కోట్లలో లాభం.. ఇదేం మాస్ కొట్టుడు సామీ!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో దక్కుతోంది. దీంతో అలా వచ్చిన మూవీలు అన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అలా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న చిత్రమే 'కాంతార'. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి... ఆ తర్వాత అన్ని భాషల్లోనూ విడుదలైన ఈ మూవీ.. మరీ ముఖ్యంగా తెలుగులో ఇప్పటికీ భారీ వసూళ్లను రాబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 20 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

తెలుగులోకి వచ్చిన కాంతార
కన్నడ ఆల్‌రౌండర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది తెలుగులో కాస్త ఆలస్యంగా అంటే అక్టోబర్ 15న గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

తెలుగులో బిజినెస్ వివరాలు
క్రేజీ కాన్సెప్టుతో రూపొంది కన్నడంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసుకున్నారు.

20వ రోజు తెలుగు వసూళ్లిలా
20వ రోజు 'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 50 లక్షలు షేర్, రూ. 95 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలైంది.

20 రోజుల్లో ఎంత వచ్చింది?
'కాంతార'కు 20 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.77 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.12 కోట్లు, గుంటూరులో రూ. 1.48 కోట్లు, కృష్ణాలో రూ. 1.46 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 23.80 కోట్లు షేర్, రూ. 43.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
గ్రామ దేవత కాన్సెప్టుతో రూపొందిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 23.80 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.50 కోట్లు లాభాలు వచ్చాయి.

లాభాలతో సంచలన రికార్డు
వినూత్నమైన పల్లెటూరి కథతో వచ్చిన 'కాంతార' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 20 రోజుల్లోనే దీనికి రూ. 21.50 కోట్ల వరకూ లాభాలు దక్కాయి. దీంతో ఈ మధ్య కాలంలో ఎక్కువ లాభాలను సొంతం చేసుకున్న డబ్బింగ్ సినిమాగా ఇది మరో రికార్డును నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











