Kantara Telugu Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 22వ రోజూ అన్ని లక్షలు.. మరో 29 లక్షలు వస్తే!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో సౌతిండియన్ సినిమాలకు దేశ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ లభిస్తుంది. అందుకే మన సినిమాలు చాలా వరకూ పాన్ ఇండియా స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే కన్నడంలో విడుదలైన నేషనల్ రేంజ్‌లో సక్సెస్‌ను సొంతం చేసుకున్న చిత్రమే 'కాంతార'. విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీ తెలుగులో సంచలన వసూళ్లతో సత్తా చాటుతోంది. నాలుగో వారంలోనూ దీనికి కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'కాంతార' 22 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

 తెలుగులో కాంతార అరాచకం

తెలుగులో కాంతార అరాచకం


కన్నడ డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది తెలుగులో కాస్త ఆలస్యంగా అంటే అక్టోబర్ 15న విడుదల అయింది.

తెలుగులో బిజినెస్ వివరాలు

తెలుగులో బిజినెస్ వివరాలు


క్రేజీ సబ్జెక్టుతో కన్నడ భాషలో రూపొంది.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఆంధ్రా, తెలంగాణలో అత్యధిక లోకేషన్లలో విడుదల అయింది.

 22వ రోజు తెలుగు వసూళ్లిలా

22వ రోజు తెలుగు వసూళ్లిలా


22వ రోజు 'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 54 లక్షలు షేర్, రూ. 90 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలైంది.

22 రోజుల్లో ఎంత వచ్చింది?

22 రోజుల్లో ఎంత వచ్చింది?


'కాంతార'కు 22 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.87 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.17 కోట్లు, గుంటూరులో రూ. 1.54 కోట్లు, కృష్ణాలో రూ. 1.51 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 24.71 కోట్లు షేర్, రూ. 44.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

 టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?


సున్నితమైన కథతో ప్రయోగాత్మకంగా వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 22 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 24.71 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 22.41 కోట్లు లాభాలు వచ్చాయి.

మరో 29 లక్షలు వసూలైతే

మరో 29 లక్షలు వసూలైతే


కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని తెలుగులో విడుదలైన 'కాంతార' మూవీకి ఆశించిన దానికంటే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 22 రోజుల్లోనే దీనికి రూ. 24.71 కోట్లు వసూలు అయ్యాయి. అంటే మరో 29 లక్షల రూపాయలను వసూలు చేస్తే.. ఈ సినిమా రూ. 25 కోట్ల షేర్ మార్కును కూడా చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X