Kantara Telugu Collections: ఆదివారం ఊరమాస్ కుమ్ముడు.. అన్ని కోట్లతో మరో సంచలన రికార్డు
ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తోన్న నేపథ్యంలో అన్ని ఇండస్ట్రీల నుంచి సరికొత్త కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. వీటికి ఆడియెన్స్ అదిరిపోయే స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా అలాంటివి భారీ సక్సెస్ అవుతున్నాయి. ఈ ఉత్సాహంతోనే కొత్త ప్రయోగాలతో సినిమాలు రూపొందిస్తున్నారు. అలా ఇటీవలే వచ్చిన సినిమానే 'కాంతార'. కన్నడంలో రూపొంది ఘన విజయం సాధించిన ఈ మూవీ.. తెలుగులో మరింత సక్సెస్ అయింది. ఇప్పటికీ హవాను చూపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 'కాంతార' 23 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

తెలుగులోకి వచ్చిన కాంతార
కన్నడ ఆల్‌రౌండర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు.

తెలుగులో బిజినెస్ వివరాలు
అదిరిపోయే కాన్సెప్టుతో కన్నడంలో రూపొంది.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఆంధ్రా, తెలంగాణలో అత్యధిక థియేటర్లలో విడుదలైంది.

23వ రోజు తెలుగు వసూళ్లిలా
'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 23వ రోజు వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 85 లక్షలు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

23 రోజుల్లో ఎంత వచ్చింది?
23 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.94 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.22 కోట్లు, గుంటూరులో రూ. 1.60 కోట్లు, కృష్ణాలో రూ. 1.56 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 25.56 కోట్లు షేర్, రూ. 46.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 25.56 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.26 కోట్లు లాభాలు వచ్చాయి.

మరో సంచలన రికార్డుతోనే
కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార' చిత్రానికి తెలుగులో ఊహించిన దానికంటే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 23 రోజుల్లోనే దీనికి రూ. 25.56 కోట్లు వసూలు అయ్యాయి. ఫలితంగా ఈ సినిమా రూ. 25 కోట్ల షేర్ మార్కును కూడా చేరుకుని మరో సంచలన రికార్డును సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











