Kantara Telugu Collections: తెలుగులో కాంతారకు తొలి షాక్.. అయినా లాభాలతో సంచలనమే

దాదాపు రెండు నెలలుగా ఇండియా మొత్తం మారుమ్రోగిపోతోన్న పేర్లలో 'కాంతార' ఒకటి. దీనికి కారణం కన్నడంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడమే. అంతేకాదు, భారీ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతూ బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మూవీ తెలుగులో ఎవరూ ఊహించని విధంగా వసూళ్ల సునామీ సృష్టించింది. దీంతో పది రెట్ల లాభాలను సొంతం చేసుకుని హవాను చూపించింది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 25 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే లుక్కేయండి!

 తెలుగులో విడుదలైన కాంతార

తెలుగులో విడుదలైన కాంతార

కన్నడ డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని తెలుగులోకి కూడా డబ్ చేశారు.

తెలుగులో బిజినెస్ వివరాలు

తెలుగులో బిజినెస్ వివరాలు

క్రేజీ కాన్సెప్టుతో కన్నడంలో రూపొంది.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఆంధ్రా, తెలంగాణలోనూ అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయింది.

25వ రోజు తెలుగు వసూళ్లిలా

25వ రోజు తెలుగు వసూళ్లిలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25వ రోజు 'కాంతార' మూవీకి వసూళ్లు తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 29 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

25 రోజుల్లో ఎంత వచ్చింది?

25 రోజుల్లో ఎంత వచ్చింది?

'కాంతార'కు 25 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.01 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 1.65 కోట్లు, కృష్ణాలో రూ. 1.61 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26.22 కోట్లు షేర్, రూ. 49.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

 టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

విభిన్నమైన కథతో ప్రయోగాత్మకంగా వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 25 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 26.22 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.92 కోట్లు లాభాలు వచ్చాయి.

తొలిసారి ఇంత తక్కువగానే

తొలిసారి ఇంత తక్కువగానే

కన్నడంలో తెరకెక్కి భారీ స్థాయిలో సక్సెస్‌ను సొంతం చేసుకున్న 'కాంతార' చిత్రానికి తెలుగులో ఊహించిన దానికంటే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 25 రోజుల్లోనే దీనికి రూ. 26.22 కోట్లు వసూలు అయ్యాయి. కానీ, 25వ రోజు మాత్రం ఈ సినిమాకు రూ. 29 లక్షలే వచ్చాయి. ఈ మూవీ ఫుల్ రన్‌లో ఇదే తక్కువ కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X