Kantara Telugu Collections: కాంతారకు మరో దెబ్బ.. తొలిసారి ఇంత తక్కువగా.. టోటల్ చూస్తే మెంటలే!
మారుతున్న పరిస్థితుల కారణంగా అన్ని ఇండస్ట్రీల్లో సరికొత్త కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సౌతిండియాలో విభిన్నమైన కథలతో ఎన్నో చిత్రాలు రూపొందుతోన్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో దర్శక నిర్మాతలు మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇటీవలే వచ్చిన క్రేజీ మూవీనే 'కాంతార'. కన్నడంలో రూపొందిన ఈ చిత్రం.. చాలా భాషల్లోకి డబ్ అయింది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 26 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

తెలుగులోకి వచ్చేసిన కాంతార
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేసుకున్నారు.

తెలుగులో బిజినెస్ వివరాలు
గ్రామ దేవతల కాన్సెప్టుతో కన్నడంలో రూపొంది.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఆంధ్రా, తెలంగాణలోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసింది.

26వ రోజు తెలుగు వసూళ్లిలా
26వ రోజు 'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 19 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

26 రోజుల్లో ఎంత వచ్చింది?
26 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, గుంటూరులో రూ. 1.66 కోట్లు, కృష్ణాలో రూ. 1.62 కోట్లు, నెల్లూరులో రూ. 94 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26.41 కోట్లు షేర్, రూ. 49.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
చాలా తక్కువ బడ్జెట్‌తోనే రూపొందిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 26 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 26.41 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.11 కోట్లు లాభాలు వచ్చి పడ్డాయి.

మరో 25 లక్షలు వసూలైతే
కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కి భారీ స్థాయిలో సక్సెస్‌ను సొంతం చేసుకున్న 'కాంతార' చిత్రానికి తెలుగులో ఊహించిన దానికంటే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 26 రోజుల్లోనే దీనికి రూ. 26.41 కోట్లు వసూలు అయ్యాయి. ఇక, దీనికి తెలుగులో మరో 25 లక్షలు రూపాయలు గ్రాస్ వసూలు అయితే.. యాభై కోట్ల క్లబ్‌లో చేరుతుంది.


Click it and Unblock the Notifications











