twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kantara Collections: పుష్ఫ రికార్డు బ్రేక్ చేసిన కాంతార.. తెలుగులో మరో ఘనత.. మొత్తం వసూళ్లు చూస్తే!

    |

    గతంలో కంటే ఇప్పుడు వైవిధ్యమైన కథలతో సినిమాలు రూపొందుతోన్నాయి. వాటికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కడంతో అలాంటివే మరిన్ని చిత్రాలు వస్తున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే 'కాంతార'. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. కొన్ని రోజుల వ్యవధిలోనే మరికొన్ని భాషల్లోనూ రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి వచ్చి.. సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ ఓవరాల్, తెలుగు కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!

    అలా వచ్చేసిన కాంతార మూవీ

    అలా వచ్చేసిన కాంతార మూవీ

    కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి తీసిన క్రేజీ సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

    హాట్ వీడియో వదిలిన ప్రగ్యా జైస్వాల్: వామ్మో ఇది మామూలు షో కాదుగా!హాట్ వీడియో వదిలిన ప్రగ్యా జైస్వాల్: వామ్మో ఇది మామూలు షో కాదుగా!

    తెలుగులో బిజినెస్ వివరాలు

    తెలుగులో బిజినెస్ వివరాలు

    విభిన్నమైన సబ్జెక్టుతో కన్నడ పరిశ్రమలో తెరకెక్కి.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఆంధ్రా, తెలంగాణలోనూ భారీగా విడుదల అయింది.

    27వ రోజు తెలుగు వసూళ్లిలా

    27వ రోజు తెలుగు వసూళ్లిలా

    'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 27వ రోజు వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 80 వేలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 వేలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    Yashoda Twitter Review: యశోదకు పాజిటివ్ టాక్.. ఆ సీన్స్‌లో అదరగొట్టిన సమంతYashoda Twitter Review: యశోదకు పాజిటివ్ టాక్.. ఆ సీన్స్‌లో అదరగొట్టిన సమంత

    27 రోజుల్లో ఎంత వచ్చింది?

    27 రోజుల్లో ఎంత వచ్చింది?

    27 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.07 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.04 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, గుంటూరులో రూ. 1.67 కోట్లు, కృష్ణాలో రూ. 1.63 కోట్లు, నెల్లూరులో రూ. 95 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26.55 కోట్లు షేర్, రూ. 50.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

    టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

    సున్నితమైన కథతో రూపొందిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 27 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 26.55 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.25 కోట్లు లాభాలు సొంతం అయ్యాయి.

    పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

    'కాంతార' చిత్రం కన్నడంలో ఆరు వారాల క్రితమే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇది 42 రోజుల్లో కర్నాటకలో రూ. 173.50 కోట్లు, తెలుగులో రూ. 50 కోట్లు, తమిళంలో రూ. 9.55 కోట్లు, కేరళలో 13.20 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 87.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.45 కోట్లతో మొత్తంగా రూ. 361.05 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 182.80 కోట్లు షేర్‌ రాబట్టింది.

    పుష్ఫ రికార్డును బ్రేక్ చేసింది

    పుష్ఫ రికార్డును బ్రేక్ చేసింది

    ఆరు వారాల్లో 'కాంతార' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 361.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఫలితంగా 'పుష్ప ద రైజ్' లైఫ్ టైం కలెక్షన్లు (360 కోట్లు)ను ఈ చిత్రం దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, తెలుగులో 27 రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ మార్కును కూడా చేరుకుని మరో సంచలన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది.

    English summary
    Rishab Shetty Did Kantara Movie Under Own Direction. This Movie Collects 26.55 Crore Share in 27 Days in Telugu States
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X