Kantara Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 29వ రోజూ ఈ రేంజ్‌లోనా.. ఇంకో 9 లక్షలు వచ్చాయంటే!
సినీ పరిశ్రమల్లో ఎన్నో రకాల చిత్రాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే సంచలనం సృష్టిస్తుంటాయి. తద్వారా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతాయి. అలాంటి వాటిలో 'కాంతార' ఒకటి. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొందిన ఈ మూవీ.. అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో మరికొన్ని భాషల్లోకి కూడా దీన్ని విడుదల చేశారు. ఈ క్రమంలోనే తెలుగులోకి వచ్చిన ఈ చిత్రం.. కనీవినీ ఎరుగని రీతిలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 29 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

తెలుగులోకి వచ్చిన కాంతార
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన క్రేజీ సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం సమకూర్చారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని రెండు వారాల తర్వాత తెలుగులో విడుదల చేశారు.

తెలుగులో బిజినెస్ వివరాలు
చిన్న బడ్జెట్‌తో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఆంధ్రా, తెలంగాణలోనూ అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు.

29వ రోజు తెలుగు వసూళ్లిలా
29వ రోజు 'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు కాస్త పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 20 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

29 రోజుల్లో ఎంత వచ్చింది?
'కాంతార'కు 29 రోజుల్లో కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.58 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.06 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, గుంటూరులో రూ. 1.70 కోట్లు, కృష్ణాలో రూ. 1.65 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26.91 కోట్లు షేర్, రూ. 50.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
వినూత్నమైన సబ్జెక్టుతో వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 29 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 26.91 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.61 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
'కాంతార' చిత్రం కన్నడంలో 44 రోజుల క్రితమే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇది 44 రోజుల్లో కర్నాటకలో రూ. 174.60 కోట్లు, తెలుగులో రూ. 50.70 కోట్లు, తమిళంలో రూ. 9.65 కోట్లు, కేరళలో 13.40 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 90.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.60 కోట్లతో మొత్తంగా రూ. 366.25 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 185.55 కోట్లు షేర్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











