Kantara Telugu Collections: 2 కోట్లు బిజినెస్.. 3 వారాల్లోనే అన్ని కోట్లు.. లాభాలతో సరికొత్త చరిత్ర
అప్పటి వాళ్ల కంటే నేటి తరం ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు వస్తున్న ప్రయోగాత్మక, కొత్త కాన్సెప్టు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలా వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన క్రేజీ మూవీ 'కాంతార'. కన్నడంలో రూపొందిన ఈ సినిమా.. అక్కడ సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా చాలా భాషల్లోకి డబ్బింగ్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవలే తెలుగులోకి వచ్చిన ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'కాంతార' 3 వారాల రిపోర్టును చూద్దాం పదండి!

తెలుగులో కాంతార సెన్సేషన్
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది తెలుగులో కాస్త ఆలస్యంగా అంటే అక్టోబర్ 15న అత్యధిక థియేటర్లలో వచ్చింది.

తెలుగులో బిజినెస్ వివరాలు
సున్నితమైన కథాంశంతో వచ్చి కన్నడంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

21వ రోజు తెలుగు వసూళ్లిలా
'కాంతార' మూవీకి 21వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 37 లక్షలు షేర్, రూ. 70 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలైంది.

3 వారాల్లో ఎంత వచ్చింది?
'కాంతార'కు 3 వారాల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.11 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.14 కోట్లు, గుంటూరులో రూ. 1.50 కోట్లు, కృష్ణాలో రూ. 1.48 కోట్లు, నెల్లూరులో రూ. 86 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 24.17 కోట్లు షేర్, రూ. 43.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?
వినూత్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 3 వారాల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 24.17 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.87 కోట్లు లాభాలు వచ్చాయి.

ఏకంగా పది రెట్లు కలెక్షన్లు
కన్నడంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని తెలుగులోకి వచ్చిన 'కాంతార' మూవీకి ఆశించిన దానికంటే ఎక్కువగా స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 21 రోజుల్లోనే దీనికి రూ. 24.17 కోట్లు వసూలు అయ్యాయి. తద్వారా రూ. 21.87 కోట్లు లాభాలు దక్కాయి. అంటే ఈ సినిమాకు దాదాపు పది రెట్లు లాభాలు వచ్చి రికార్డు నమోదైంది.


Click it and Unblock the Notifications











