Kantara Collections: తెలుగులో కాంతార మరో ఘనత.. ఇంకో 15 లక్షలు వస్తే ఊహించని రికార్డు

గతంలో కంటే ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీ నుంచి ప్రయోగాత్మక కథలతో సినిమాలు వస్తున్నాయి. వీటికి అన్ని వర్గాల సినీ ప్రియుల నుంచి అదిరిపోయే స్పందన కూడా దక్కుతోంది. ఫలితంగా ఈ తరహా చిత్రాలు ఎక్కువ సంఖ్యలో తెరకెక్కుతోన్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే 'కాంతార'. కన్నడంలో రూపొందిన ఈ మూవీ.. ఆ తర్వాత అన్ని భాషల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే తెలుగులోకి నెల రోజుల క్రితమే వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ తెలుగులో 30 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

తెలుగులో విడుదలైన మూవీ

తెలుగులో విడుదలైన మూవీ

ప్రముఖ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి చేసిన సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం సమకూర్చారు. కన్నడంలో సక్సెస్ అవడంతో దీన్ని ఆ తర్వాత తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.

తెలుగులో బిజినెస్ వివరాలు

తెలుగులో బిజినెస్ వివరాలు

క్రేజీ కాన్సెప్టుతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది. అలా ఆంధ్రా, తెలంగాణలోనూ దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసింది.

30వ రోజు తెలుగు వసూళ్లిలా

30వ రోజు తెలుగు వసూళ్లిలా

'కాంతార' మూవీకి 30వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు కొంచెం పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 24 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది.

 30 రోజుల్లో ఎంత వచ్చింది?

30 రోజుల్లో ఎంత వచ్చింది?

30 రోజుల్లో 'కాంతార'కు కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.61 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.08 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.30 కోట్లు, గుంటూరులో రూ. 1.71 కోట్లు, కృష్ణాలో రూ. 1.67 కోట్లు, నెల్లూరులో రూ. 97 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 27.15 కోట్లు షేర్, రూ. 51.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

విభిన్నమైన కథతో వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 30 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 27.15 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.85 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

శృతి మించిన శివాత్మిక బోల్డు షో: ఆ డ్రెస్సేంటి.. ఆ ఫోజులేంటి బాబోయ్!
https://telugu.filmibeat.com/heroine/shivathmika-rajashekar-looks-beautiful-in-latest-pics-114670.html

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

'కాంతార' మూవీ కన్నడంలో 44 రోజుల క్రితమే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇది 44 రోజుల్లో కర్నాటకలో రూ. 175.45 కోట్లు, తెలుగులో రూ. 51.15 కోట్లు, తమిళంలో రూ. 9.70 కోట్లు, కేరళలో 13.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 92.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.65 కోట్లతో మొత్తంగా రూ. 369.70 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 187.40 కోట్లు షేర్‌ రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X