Kantara collections : 300 కోట్లు కొల్లగొట్టిన కాంతార ..32 రోజుల తర్వాత తగ్గని రిషబ్ శెట్టి కలెక్షన్ల హోరు!
కంతారా చిత్రం ఇండియన్, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కలెక్షన్ల హవా కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 29న రిలీజైన ఈ చిత్రం నెల రోజుల దాటినా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. 32 రోజులు వసూళ్ల జైత్రయాత్ర తర్వాత కూడా దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను క్రియేట్ చేస్తున్నది. రిషబ్ శెట్టి, సప్తమీ గౌడ నటించిన ఈ చిత్రం 32 రోజుల కన్నడ వసూళ్లు, 18 రోజుల హిందీ బాక్సాఫీస్ రిపోర్టు, 17 రోజుల తెలుగు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఉత్తరాదిలో హిందీ వెర్షన్
కంటెంట్ బాగుంటే.. ఏ భాష చిత్రాన్నైనా ఆదరిస్తామనే విషయాన్ని కంతాారా సినిమా విషయంలో ఉత్తరాది ప్రేక్షకులు నిరూపించారు. గత 18 రోజులుగా ఎడతెరపని కలెక్షన్లను ఈ సినిమా కురిపిస్తున్నది. మూడో వారంలో తొలి శుక్రవారం 2.75 కోట్లు, శనివారం 4.10 కోట్లు, ఆదివారం 4.4 కోట్లు సాధించింది. ఇక సోమవారం 90 లక్షల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం హిందీ వెర్షన్ సుమారు 44 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.

కన్నడలో జైత్రయాత్ర కొనసాగింపు
ఇక కన్నడ వెర్షన్‌కు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలివారం దేశవ్యాప్తంగా 30.3 కోట్లు, రెండోవారం 42.3 కోట్లు, మూడో వారం 34 కోట్లు, నాలుగో వారం 28 కోట్లు వసూలు చేసింది. ఇక ఐదో వారంలో మొదటి రోజు 1.43 కోట్లు, రెండో రోజు 2.47 కోట్లు, మూడో రోజు అంటే ఆదివారం 3.5 కోట్లు రాబట్టింది. ఇక నాలుగో రోజు 1 కోటి రూపాయలు నమోదు చేసింది.

తమిళ, మలయాళంలో
ఇక తమిళ, మలయాళం విషయానికి వస్తే.. తొలివారంలో తమిళ భాషలో 1.8 కోట్లు, మలయాళంలో 40 లక్షలు, రెండోవారంలో 1.94 కోట్లు, మలయాళంలో 3.43 కోట్లు రాబట్టింది. మూడో వారంలో గత నాలుగు రోజుల్లో తమిళంలో 80 లక్షలకుపైగా, మలయాళంలో 3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

నైజాం, ఆంధ్రాలో తెలుగు వెర్షన్
ఇక తెలుగు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత 17 రోజుల్లో కంతారా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తెలుగు విషయానికి వస్తే.. తొలి వారం 16.6 కోట్లు, రెండో వారం 9.08 కోట్లు వసూలు చేసింది. ఇక 14వ రోజున తెలుగులో 30 లక్షలు, 15వ రోజున 52 లక్షలు, 16వ రోజున 2.9 కోట్లు, 17వ రోజున 60 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 30 కోట్లకుపైగా గ్రాస్, 21 కోట్లకుపైగా షేర్ సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా 32 రోజుల కలెక్షన్లు
ఇక కంతారా చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే.. ఈ చిత్రం దేశవ్యాప్తంగా 268.21 కోట్ల వసూళ్లను, ఓవర్సీస్‌లో 21 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం 290 కోట్ల వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం 300 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమైంది. ఈ చిత్రం 400 కోట్ల వసూళ్లను సాధించడానికి స్కోప్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











