Kantara Telugu Collections: తెలుగులో కాంతార సంచలనం.. 2 కోట్లకు కొంటే అన్ని కోట్ల లాభాలు

సాధారణంగా అన్ని ఇండస్ట్రీల నుంచి ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే విజయాలను అందుకుంటాయి. వాటిలోనూ మరికొన్ని సినిమాలు మాత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇలా ఇప్పుడు కొద్ది రోజులుగా హైలైట్ అవుతోన్న సినిమానే 'కాంతార'. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే చాలా భాషల్లోకి వచ్చింది. అలా తెలుగులో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'కాంతార' 8 రోజుల రిపోర్టును మీరే చూడండి!

నేషనల్ రేంజ్‌కెళ్లిన కాంతార

నేషనల్ రేంజ్‌కెళ్లిన కాంతార

కన్నడ పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే 'కాంతార'. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది కన్నడంలో ఎప్పుడో వచ్చినా తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.

తెలుగులో బిజినెస్ వివరాలు

తెలుగులో బిజినెస్ వివరాలు

సెప్టెంబర్ 30వ తేదీన కన్నడంలో రిలీజై ఘన విజయాన్ని దక్కించుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. చాలా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తెచ్చింది.

8వ రోజు తెలుగు వసూళ్లిలా

8వ రోజు తెలుగు వసూళ్లిలా

8వ రోజు 'కాంతార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.02 కోట్లు షేర్, రూ. 1.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

8 రోజుల్లో ఎంత వచ్చింది?

8 రోజుల్లో ఎంత వచ్చింది?

'కాంతార'కు 8 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.64 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.00 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 64 లక్షలు, గుంటూరులో రూ. 80 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 50 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 12.39 కోట్లు షేర్, రూ. 22.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

విభిన్నమైన కాన్సెప్టుతో వచ్చిన 'కాంతార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 12.39 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.09 కోట్లు లాభాలు దక్కాయి.

లాభాలతో నయా రికార్డు

లాభాలతో నయా రికార్డు

క్రేజీ సబ్జెక్టుతో వచ్చిన 'కాంతార' మూవీ తెలుగులో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది వరుసగా ఆరు రోజుల పాటు కోటి రూపాయల కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఏడో రోజు కాస్త తగ్గినా.. ఎనిమిదో రోజు మళ్లీ కోటి మార్కును దాటేసింది. ఇలా 8 రోజుల్లోనే 12.39 కోట్లు రాబట్టడంతో పాటు పది కోట్లకు పైగా లాభాలు అందుకుంది. తద్వారా రికార్డు నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X