Kantara collections 150 కోట్లకు చేరువగా.. గాడ్‌ఫాదర్‌కు భారీ దెబ్బ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే బ్యానర్‌పై విజయ్ కిరంగదూరు నిర్మాణ సారథ్యంలో కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన కంతారా చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని మొదలుపెట్టింది. గత 16 రోజుల క్రితం కన్నడ వెర్షన్ రిలీజైన తర్వాత ప్రస్తుతం వివిధ భాషల్లోకి డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కంతారా చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు 1వ రోజు, హిందీ 2వ రోజు, కన్నడ వెర్షన్ 16వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గాడ్‌ఫాదర్‌కు భారీ దెబ్బ

గాడ్‌ఫాదర్‌కు భారీ దెబ్బ

కంతారా సినిమా డబ్బింగ్ రైట్స్‌ను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సొంతం చేసుకొన్నారు. తెలుగులో 305 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు. ఆంధ్రాలో 115కిపైగా, నైజాంలో 115 థియేటర్లకుపైగా, సీడెడ్‌లో 50 థియేటర్లలో రిలీజ్ చేశారు. పలుచోట్ల గాడ్‌ఫాదర్ సినిమాను తీసేసి కంతారాను ప్రదర్శిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులు 2 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

తమిళం, మలయాళంలో

తమిళం, మలయాళంలో

ఇక కంతారా చిత్రాన్ని తమిళంలో 100 థియేటర్లకుపైగా రిలీజ్ చేశారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తుండటంతో ఈ సినిమాకు పెద్దగా థియేటర్లు లభించలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే మలయాళంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాత, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ సిద్దమవుతున్నారు. మలయాళ డబ్బింగ్ హక్కులను లూసిఫర్ నిర్మాత, దర్శకుడు సొంతం చేసుకోవడం గమనార్హం.

కన్నడలో 16వ రోజు ఆక్యుపెన్సీ

కన్నడలో 16వ రోజు ఆక్యుపెన్సీ

కంతారా చిత్రానికి దేశవ్యాప్తంగా భారీ ఆదరణ లభిస్తున్నది. కన్నడలో 16వ రోజున కూడా 68 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. హిందీలో రోజు రోజుకు ఆక్యుపెన్సీ పెరుగుతున్నది. రెండో రోజు 25 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో మొదటి రోజు సుమారు 45 శాతం అక్యుపెన్సీ కనిపించింది.

కన్నడలో 100 కోట్లకు చేరువగా

కన్నడలో 100 కోట్లకు చేరువగా

కంతారా చిత్రం గత 16 రోజుల్లో కన్నడ వెర్షన్ తొలివారం 30 కోట్లకుపైగా, రెండోవారం 42.3 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక మూడో వారంలో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. 15వ రోజు కన్నడలో 4.27 కోట్లు, 16వ రోజు 7.89 కోట్లు వసూలు చేసింది. కన్నడ వెర్షన్ దాదాపు 85 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

హిందీలో భారీగా వసూళ్లు

హిందీలో భారీగా వసూళ్లు

ఇక కంతారా సినిమా హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. తొలి రోజు 1.27 కోట్లు, రెండో రోజు 2.39 కోట్లతో మొత్తం 4 కోట్లు రాబట్టింది. ఇక తెలుగులో ఈ చిత్రం తొలి రోజున 5 కోట్లకుపైగా గ్రాస్, తమిళంలో 30 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

 ప్రపంచవ్యాప్తంగా కంతారా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కంతారా కలెక్షన్లు

కంతారా చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీగా రెస్పాన్స్‌ను కూడ గట్టుకొంటున్నది. అమెరికాలో ఈ చిత్రం 500k డాలర్లను రాబట్టింది. అత్యధిక వసూళ్లను సాధించిన కన్నడ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఆస్ట్రేలియాలో 126k డాలర్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 114 కోట్ల రూపాయలను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X