Kantara collections కంతారా కలెక్షన్ల ప్రభంజనం.. 200 కోట్లకు చేరువగా.. తెలుగులో రికార్డు వసూళ్లు!

దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న కంతారా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇటీవల హిందీ, తెలుగు, తమిళంలో డబ్బింగ్ చిత్రంగా విడుదల చేయడంతో ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ వ్యక్తమవుతున్నది. ప్రాంతాలు, భాష అనే తేడా లేకుండా ఈ చిత్రం భారీ రెస్సాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. హోంబలే బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ నటించిన ఈ చిత్రంపై అన్ని వర్గాలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 17 రోజున ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

బాక్సాఫీస్ వద్ద అద్బుతాలు

బాక్సాఫీస్ వద్ద అద్బుతాలు

కంతారా చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్బుతాలు సృష్టిస్తున్నది. కంతారా మూవీ తొలి రోజున దేశవ్యాప్తంగా 1.98 కోట్లు రాబట్టింది. అయితే 17 రోజుకు వచ్చే సరికి ఈ చిత్రం 20 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజుతో పోల్చుకొంటే.. 910 శాతం వృద్ధిని సాధించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రం ఈ రేంజ్ వసూళ్లను సాధించిన దాఖలాలు లేవని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కన్నడలో కంతారాకు బ్రహ్మరథం

కన్నడలో కంతారాకు బ్రహ్మరథం

కన్నడలో కంతారా చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. కర్ణాటకలోని కుందాపురలో 100 శాతం అక్యుపెన్సీ, మైసూరు, శివమొగ్గ, మణిపాల్, మంగళూరు, హుబ్లీ, బెంగళూరు, బెల్గాం లాంటి పట్టణాల్లో దాదాపు 95 శాతం అక్యుపెన్సీ నమోదు కావడం రికార్డు కలెక్షన్లకు కారణమవుతున్నది.

ఉత్తరాదిలో పెరుగుతున్న ఆదరణ

ఉత్తరాదిలో పెరుగుతున్న ఆదరణ

ఇక ఉత్తరాది ప్రాంతాల్లో కంతారాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. కానీ అక్యుపెన్సీ మాత్రం 25 శాతం కంటే తక్కువగానే నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీగా అక్యుపెన్సీ కనపించింది. కాకినాడలో 92 శాతం కాగా, మిగితా ప్రాంతాల్లో 50 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

దేశవ్యాప్తంగా కలెక్షన్ల జోరు

దేశవ్యాప్తంగా కలెక్షన్ల జోరు

గత రెండు వారాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేవలం కన్నడలోనే కంతారా చిత్రం రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. తొలి వారం 30.3 కోట్లు వసూలు చేసింది. రెండోవారంలో 42.3 కోట్లు రాబట్టింది. మూడోవారంలో ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్ కావడంతో కలెక్షన్ల ఊపు జోరందుకొన్నది.

తెలుగులో 2 రోజుల్లో

తెలుగులో 2 రోజుల్లో

ఇక కంతారా చిత్రం 17వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా 20 కోట్ల వసూళ్లను రాబట్టింది. కన్నడలో 8 కోట్లకుపైగా వసూళ్లు, హిందీలో 2.75 కోట్ల షేర్, 5 కోట్లకుపైగా గ్రాస్, తెలుగులో 3.2 కోట్ల షేర్, 6.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో గత రెండు రోజుల్లో మొత్తంగా 11.5 కోట్ల వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో కంతారా 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.18 కోట్లు, సీడెడ్‌లో 38 లక్షలు, ఉత్తరాంధ్రలో 36 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 24 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 లక్షలు, గుంటూరులో 19 లక్షలు, కృష్ణా జిల్లాలో 17 లక్షలు, నెల్లూరులో 12 లక్షల వసూళ్లతో 3.2 కోట్ల షేర్, 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

 తెలుగులో భారీ లాభాలతో..

తెలుగులో భారీ లాభాలతో..

కంతారా చిత్రం గత 17వ రోజుల్లో దేశవ్యాప్తంగా 113 కోట్ల షేర్ సాధించింది. త్వరలోనే ఈ చిత్రం 200 కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మూడో వారం ముగింపు నాటికి ఈ సినిమా 200 క్లబ్ చేరడం ఖాయమనే ధీమాను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి.. డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X