Kantara Collections బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న రిషబ్ షెట్టి.. ఉత్తరాదిలో సంచలనానికి ప్లాన్ రెడీ..

కన్నడ చిత్రం కంటారా ఎలాంటి అంచనాలు లేకుండా దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. సినీ విమర్శకులు, నటులు, ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకొంటున్నది. ఈ సినిమా గత 6 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కేజీఎఫ్ నిర్మాతల నుంచి

కేజీఎఫ్ నిర్మాతల నుంచి


కన్నడ సూపర్ స్టార్ రిషబ్ షెట్టి నటించి దర్శకత్వం వహించిన కంటారా చిత్రం ఊహించని టాక్‌తో దూసుకెళ్తున్నది. కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థ రూపొందించిన ఈ సినిమా తొలి రోజు కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ మూవీ మెల్ల మెల్లగా దేశంలోని సినీ అభిమానుల ఆదరణను చూరగొంటున్నది. ఈ చిత్రం తొలి రోజున 1.6 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఆరు రోజుల్లో భారీగా

ఆరు రోజుల్లో భారీగా


తొలి రోజు మౌత్ టాక్ భారీగా పెరగడంతో రెండో రోజు 100 శాతం వృద్దిని సాధించింది. రెండో రోజు అంటే శనివారం 3 కోట్లు, ఆదివారం 4.15 కోట్లు, సోమవారం 3.15 కోట్లు, మంగళవారం 4 కోట్లు వసూలు చేసింది. ఇక బుధవారం మరో 25 శాతం వృద్ధిని సాధించి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. ఆరో రోజున ఈ చిత్రం 5.1 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

కర్ణాటకలోనే 20 కోట్లకుపైగా

కర్ణాటకలోనే 20 కోట్లకుపైగా


కంటారా చిత్రం గత 6 రోజుల్లో 21 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. అయితే ఇందులో 20 కోట్లకుపైగా కర్ణాటక నుంచే వసూలు చేయడం రికార్డుగా మారింది. తొలి వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం 25 కోట్ల మార్కును దాటేసే అవకాశం ఉంది.

50 కోట్ల క్లబ్‌ వైపు

50 కోట్ల క్లబ్‌ వైపు


కర్ణాటకలో రెండోవారం కూడా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ఇదే ఊపును కొనసాగిస్తే.. తక్కువలో తక్కువ 50 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

హిందీ ట్రైలర్ రెడీ..


ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఉత్తరాదిలో కంటారా చిత్రానికి అనూహ్య స్పందన మొదలైంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హెంబలే ఫిలింస్ యూనిట్ కంటారా సినిమాను హిందీలో డబ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. కంటారా చిత్రానికి సంబంధించిన హిందీ ట్రైలర్‌ను అక్టోబర్ 9వ తేదీన 9.10 గంటలకు రిలీజ్ చేస్తున్నామని అని హీరో రిషబ్ షెట్టి ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X