Kantara Telugu Collections: రూ. 50 కోట్ల మార్క్ దాటిన కాంతార తెలుగు వెర్షన్.. షాకింగ్ గా లాభాలు!
చిన్న సినిమా అయిన కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది కాంతార. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొందిన ఈ కాంతార చిత్రం అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి వారం రోజుల్లో మరో మూడు భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. దీంతో విడుదలైన అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తెలుగులో డబ్బింగ్ అయిన 'కాంతార' పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కాంతార' మూవీ 18 రోజుల రిపోర్టు వివరాళ్లోకి వెళితే..

కాస్త ఆలస్యంగా..
కన్నడ చిత్రసీమకు చెందిన రిషబ్ శెట్టి హీరోగా చేస్తూనే దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రమే 'కాంతార'. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలు పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది తెలుగులో కాస్త ఆలస్యంగా అక్టోబర్ 15న విడుదలైంది.

రూ. 2.00 కోట్లకు తెలుగు హక్కులు..
ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి కన్నడంలో భారీ విజయం సాధించిన 'కాంతార'ను దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను రూ. 2.00 కోట్లకు తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజు..
'కాంతార' చిత్రానికి 18వ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వసూళ్లు అరకొరగా తగ్గినట్లు తెలుస్తోంది. ఫలితంగా నైజాంలో రూ. 41 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 81 లక్షలు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

18 రోజుల్లో ఏపీ, తెలంగాణ వసూళ్లు..
క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కిన 'కాంతార' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా స్పందనే వచ్చింది. ఫలితంగా 18 రోజుల్లో నైజాంలో రూ. 10.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.66 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.87 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.72 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.08 కోట్లు, గుంటూరులో రూ. 1.43 కోట్లు, కృష్ణాలో రూ. 1.40 కోట్లు, నెల్లూరులో రూ. 83 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 22.68 కోట్లు షేర్, రూ. 41.15 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఏపీ, తెలంగాణలో వచ్చిన లాభం ఎంతంటే..
వైవిధ్యమైన సంస్కృతి సాంప్రాదాయ కథతో రూపొందిన 'కాంతార' చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో రూ. 22.68 కోట్లకుపైగా వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.38 కోట్లకుపైగా లాభాలు వచ్చినట్లు సమాచారం.

రూ. 50 కోట్ల మార్క్ దాటి..
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కాంతారా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు 18 రోజుల్లో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది హోంబలే ఫిల్మ్స్. కాంతారా సినిమా తెలుగు వెర్షన్ రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది. పాజిటివ్ మౌత్ టాక్, సాలిడ్ బుకింగ్స్ తో సినిమా అద్భుతంగా ప్రదర్శించబడుతోంది. మంచి సినిమాను తెలుగు ప్రేక్షుకులు ఎంతగా ఆదరిస్తారో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











