Rishab Shetty: కాంతార 2 కోసం ప్రభాస్ స్థాయిలో రెమ్యునరేషన్.. ఫస్ట్ పార్ట్ కంటే 95 కోట్లు ఎక్కువగా..

పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ సినిమాలలో కాంతార ఒకటి. అయితే ఈ సినిమా ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కన్నడలో కంటే మిగతా భాషల్లోనే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. ఇక దర్శకుడు కథానాయకుడు రిషబ్ శెట్టి సీక్వెల్ కోసం ఎక్కువ స్థాయిలో పారితోషకం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ప్రభాస్ రేంజ్ లోనే అతనికి పేమెంట్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమైనట్లు సమాచారం. ఆ వివరాలలోకి వెళితే..

మొదట సొంత భాషలో..

మొదట సొంత భాషలో..

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ వచ్చిన తర్వాత సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా మార్కెట్లో ఆ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక అలాంటి టైంలోనే కాంతార సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. ఒరిజినల్ భాషలో విడుదలైన వారం తరువాత మిగతా భాషల్లో ఈ సినిమాను లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేశారు. మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్లింది.

 ఊహించని కలెక్షన్స్

ఊహించని కలెక్షన్స్

కన్నడలోనే పెట్టిన పెట్టుబడికి ఊహించిన స్థాయిలో ప్రాఫిట్స్ అందించిన ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం అలాగే హిందీలో కూడా డబుల్ ప్రాఫిట్స్ అందించి నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్స్ అందరిని కూడా హ్యాపీ చేసింది. కాంతార సినిమా 450 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు.

సీక్వెల్ కోసం బిగ్ బడ్జెట్

సీక్వెల్ కోసం బిగ్ బడ్జెట్

అయితే ఈ సినిమాలో హీరో గానే కాకుండా దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టి సరైన న్యాయం చేయడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. అయితే రిషబ్ శెట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అంతకుమించి అనేలా నిర్మించాలని అనుకుంటున్నాడు. హోంబల్ ప్రొడక్షన్ సెకండ్ పార్ట్ ను దాదాపు 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాంతర రెమ్యునరేషన్

కాంతర రెమ్యునరేషన్

ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్ల కు పైగా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా జాక్ పాట్ కొట్టేశారు అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు నిర్మించేటప్పుడు దర్శకుడిగా హీరోగా రిషబ్ శెట్టి కేవలం ఐదు కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడు. ఇక ప్రాఫిట్ లో అతనికి మరికొంత ఇచ్చినట్లుగా ఒక టాక్ అయితే వచ్చింది.

 సీక్వెల్ కోసం ప్రభాస్ స్థాయిలో..

సీక్వెల్ కోసం ప్రభాస్ స్థాయిలో..

అయితే ఇప్పుడు సీక్వెల్ కోసం రిషబ్ కు ఊహించని స్థాయిలో పారితోషికం అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగానికి ఐదు కోట్ల తీసుకున్న అతనికి ఇప్పుడు 50 కోట్ల వరకు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమయ్యారట. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో వాటాగా మరో 50 కోట్లు ఇస్తారని తెలుస్తోంది. అంటే దాదాపు ప్రభాస్ రేంజ్ లోనే రిషబ్ 100 కోట్ల వరకు వారితోషికం అందుకునే అవకాశం ఉంది. మరి కాంతార సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: rishab shetty kantara 2 tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X