‘నాయక్’ మలయాళ వెర్షన్ రిజల్ట్ ఏంటి?

By Srikanya

హైదరాబాద్: సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ 'నాయక్' చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో మార్చి 27 న మళయాళంలోకి డబ్బింగ్ చేసి కేరళలలో విడుదల చేసారు. దాదాపు నలభై స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో థియేటర్స్ ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ మీడియా ఈ చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇచ్చింది. ఇక దాదాపు అక్కడ రెండు కోట్లు వరకూ షేర్ వస్తుందని అంచనా.

ఈ ఉత్సాహంతో తమిళ వెర్షన్ ని ఏప్రియల్ 12 గానీ, ఏప్రియల్ 27న గానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసారు. వినాయక్ తరచూ తీసే రొటీన్ సినిమాలా ఉందనే విమర్శలు వచ్చినప్పటికీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, జిలేబీ పాత్రలో బ్రహ్మీ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు కాజల్, అమలా పాల్ గ్లామర్ సొగసులతో పాటు, తమన్ సంగీతం, చోటా కె నాయుడు కెమెరా పనితనం బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఐస్ లాండ్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్లలో 'శుభలేఖ రాసుకున్న' సాంగు చిత్రీకరణ అందరినీ ఆకట్టుకుంది.

వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. సంక్రాంతిని పురస్కరించుకని జనవరి 9న ఈచిత్రం విడుదలైంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X