Robinhood Closing Collections: రాబిన్‌హుడ్ హిట్టా? ఫట్టా? నితిన్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం రాబిన్‌హుడ్. యువ హీరో నితిన్, డ్యాన్స్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించారు. టాప్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ సినిమాకు లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..
హీరో నితిన్ కెరీర్ ఊగిసలాటకు గురి అవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా హిట్ సాధించాల్సిన సమయంలో రాబిన్‌హుడ్ మూవీతో వచ్చారు. తనకు గతంలో అంటే చివరిసారిగా భీష్మ రూపంలో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములను నమ్ముకొన్నాడు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణల ఎంపిక సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాబిన్ హుడ్ సినిమాను మైత్రీ మూవీస్ భారీగా నిర్మించింది. ఈ సినిమా ద్వారా డేవిడ్ వార్నర్‌ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది. ఈ సినిమా కోసం రాజీ పడకుండా క్వాలిటీతో సినిమాను నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
రాబిన్‌హుడ్ సినిమా టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడం, అలాగే డేవిడ్ వార్నర్ నటించారనే వార్తకు మంచి స్పందన రావడంతో ఈ మూవీ బిజినెస్ ఓ రేంజ్‌లో వ్యాల్యూ కట్టారు. ఈ సినిమా ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 23 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ ఇతర ప్రాంతాల రైట్స్ 5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా మొత్తంగా 28 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను వాల్యూ కట్టారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రాబిన్‌హుడ్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కలిపి ఈ సినిమా 2.3 కోట్ల రూపాయల నెట్, 4.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు 2 కోట్లకుపైగా నెట్, మూడో రోజు 2.85 కోట్లు, నాలుగో రోజు 1.35 కోట్లు, 6వ రోజు 80 లక్షలు, 6వ రోజు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. నితిన్, శ్రీలీల నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గత ఆరు రోజుల్లో 10 కోట్ల నెట్, 13.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని సాక్ నిల్క్ వెల్లడించింది.
రాబిన్‌హుడ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం చూస్తే.. ఈ సినిమా సుమారుగా 18 కోట్ల రూపాయలు మేర నష్టంతో ముగిసే అవకాశం ఉంది. ఓవరాల్ బడ్జెట్ ప్రకారం చూస్తే.. ఈ సినిమా భారీ లాభాల్లోనే ముగిసే అవకాశం కనబడుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ఈ నష్టాన్ని కొంత మేరకు తగ్గించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లో వరుసగా 6 ఫ్లాప్ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











