»   » షాకిస్తున్న రజనీకాంత్ 'రోబో' నైజాం రైట్స్

షాకిస్తున్న రజనీకాంత్ 'రోబో' నైజాం రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ లేటెస్ట్ రోబో చిత్రం ఇప్పటికే ఇరవై ఏడు కోట్లుకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఓ డబ్బింగ్ చిత్రానికి ఈ రేంజిలో రేటు పలకటం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడు ఈ చిత్రం బిజినెస్ లో మరో విచిత్రం చోటు చేసుకోబోతోంది. ఈ చిత్రానికి సంభందించిన నైజాం రైట్స్ ని పదికోట్ల కు అడుగుతున్నారని వినపడుతోంది. అదే గనుక జరిగితే ఇండస్ట్రీ మొత్తం షాక్ అవ్వాల్సిన సీన్ అవుతుంది. ఎందుకంటే పదికోట్లతో మనకి ఓ స్టార్ హీరో సినిమా రెడీ అయిపోతుంది. అందులోనూ స్టైయిట్ అతి పెద్ద సినిమాలా ఈ చిత్రం బిజెనెస్ ఎంక్వైరీలు జరగటం ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 23న రిలీజ్ కాబోతోంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా చేసింది. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ గా రూపొందింది. రజనీ చేసే ఆ పాత్రలు సైంటిస్టు, రోబో. ఇక ఇంతకుముందు రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సూపర్ హిట్ అవటంతో ఆ ఎఫెక్ట్ ట్రేడ్ లో బాగా ఉంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu