రజనీ 'రోబో' తెలుగు వెర్షన్ రేటు ఎంత పలికిందంటే...
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న క్రేజీ ప్రాజెక్టు రోబో డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ విపరీతంగా ఉందని సమాచారం. ఈ చిత్రం ఒరిజనల్ తమిళ్ వెర్షన్ నిర్మాత దయానిధి మారన్..తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని 30 కోట్లకు తక్కువ అయితే అమ్మకూడదనే నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నారు. ఈ రేటు చెప్పినప్పటికీ డబ్బింగ్ సినిమాలుతో క్రేజు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్..22 కోట్లకు కోట్ చేసారని, అయితే మరో తెలుగు టాప్ ప్రొడ్యూసర్ మరో కోటి కలిపి 23 చేసారని వీరిద్దరి మధ్యా రైట్స్ పోరాటం నలుగుతోందని, అయితే అనుకోని విధంగా మరో నిర్మాత 26 కోట్లతో ముందుకొచ్చి ఇద్దరికీ ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం స్ట్రైయిట్ తెలుగు చిత్రం కన్నా ఓపినింగ్స్, కలెక్షన్స్ భారీ స్ధాయిలో ఉంటాయని అంతా భావిస్తున్నారు. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, ఎఆర్ రహమాన్, శంకర్ ఈ కాంబినేషన్ ఈ చిత్రం మార్కెట్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ వరస చూస్తూంటే రోబో ఏ రేటుకి ఫైనల్ అవుతుందో..ఏ రేంజి హిట్టవనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











