Rocky Aur Rani Ki Prem Kahani Collections ఆలియా, రణ్‌వీర్ బాక్సాఫీస్ మ్యాజిక్.. కరణ్ జోహర్ మూవీకి ఎన్ని కోట్ల

ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ నిర్మాణంతోపాటు దర్శకత్వం వహించిన చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani). ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్ మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజాలు ధర్మేంద్ర, జయబచ్చన్, షబానా ఆజ్మీ కీలక పాత్రలను పోషించారు.రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్లు భారీ బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు భారీ ఓపెన్సింగ్స్ నమోదు అయ్యాయి. ఈ క్రమంలో రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమా కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) మూవీ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. కరణ్ జోహర్ తనదైన శైలితో రిచ్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కోసం సుమారు 180 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉండటంతో ఇండియాలోనే 3200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Rocky Aur Rani Ki Prem Kahani Collections

రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను 80 కోట్లు చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకొన్నది.కలర్స్ ఛానెల్స్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను 50 కోట్లకు దక్కించుకొన్నది.

సారేగామ కంపెనీ 30 కోట్లు చెల్లించి మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకొన్నది. నాన్ థియేట్రికల్ రైట్స్ వల్ల 160 కోట్లు రావడంతో ఈ సినిమా దాదాపు రిలీజ్‌కు ముందే లాభాలను సొంతం చేసుకొన్నది. థియేట్రికల్ రైట్స్ భారీగానే నమోదు అ్యాయి. దాంతో ఈ సినిమా మంచి ప్రాఫిట్స్‌తో ప్రేక్షలకు ముందుకు వచ్చింది.

రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు ప్రేక్షకులను భారీ సంఖ్యలో థియేటర్‌కు రప్పించడంలో విఫలమైంది.దేశవ్యాప్తంగా ఉదయం ఆటకు 15 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 20 శాతం, ఫస్ట్ షోకు 25 శాతం, సెకండ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 14 నుంచి 15 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ కలెక్షన్లు బాలీవుడ్ సినిమాకు రావడం అరుదుగా కనిపించింది. వారాంతంలో పుంజుకొంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించడానికి పెద్దగా కష్టం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఇక బాక్సాఫీస్ వద్ద రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. భారీ లక్ష్యమే కనిపిస్తున్నది. ఈ సినిమా థియేట్రికల్‌గా హిట్ కావాలంటే.. కనీసం ఈ సినిమా 180 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సినిమాను హిట్‌గా పరిగణించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X