Rocky Aur Rani Ki Prem Kahani collections 100 కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఆలియా, రణ్‌వీర్ మూవీ
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్ జంటగా నటించిన చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ తన సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద తడబాటు కనిపించినా.. మరుసటి రోజు నుంచి భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు భారీ క్రేజ్ లభించడంతో బిజినెస్ కూడా హై రేంజ్‌లో జరిగింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే దాదాపు లాభాలను నమోదు చేసుకొన్నది.

రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) మూవీ చిత్ర బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ 100 కోట్లు కాగా, నాన్ థియేట్రికల్ బిజినెస్ 160 కోట్ల రూపాయలుగా నమోదైంద.ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 3200 థియేటర్లలో రిలీజ్ చేశారు.
జూలై 28 తేదీన రిలీజైన రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం వీకెండ్‌లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లో కూడా మంచి వసూళ్లన సాధిస్తున్నది. ఈ చిత్రం 100 కోట్ల మైలురాయిని చేరుకొనేందుకు పరుగులు పెడుతున్నది.

రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) చిత్రం తొలి రోజున 11 కోట్లకుపైగా, రెండో రోజు 16 కోట్లకుపైగా, మూడో రోజు 19 కోట్లు, నాలుగో రోజు 7.5 కోట్లు, ఐదో రోజు 7 కోట్లు, ఆరో రోజు 7 కోట్ల రూపాయలు, ఏడో రోజు 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.
రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) సినిమా గత 6 రోజుల్లో 67 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం 7వ రోజున 6.5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా 74 కోట్లు తొలి వారంలో సాధించే అవకాశం ఉంది. రెండో వారం ముగిసే సమయానికి ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











