Rocky Aur Rani Ki Prem Kahani Collections బాక్సాఫీస్ వద్ద రాకీ రాణీ జోష్.. 50 కోట్లకు చేరువలో ఆలియాభట్ మూవీ
బాలీవుడ్ సూపర్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ నటించిన రాకీ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ముందుకెళ్తున్నది. తొలి రోజు అంతగా ఆకట్టుకోలేకపోయిన కరణ్ జోహర్ మూవీ.. శని, ఆదివారాల్లో మెరుగైన కలెక్షన్లను రాబట్టింది. ధర్మేంద్ర, జయబచ్చన్, షబానా ఆజ్మీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గత మూడు రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
రాకీ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం సుమారు 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 240 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్ పరంగా లాభాలను సొంతం చేసుకొన్నది. అయితే థియేట్రికల్ బిజినెస్ 160 మేర జరిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద 160 కోట్లు సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

రాకీ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీ తొలి రోజు ఇండియాలో 11 కోట్ల కలెక్షన్లు, రెండో రోజు 16 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక మూడో రోజు 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 47 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.
రాకీ రాణి కీ ప్రేమ్ కహానీ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 3.75 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో 31 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

రాకీ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రం సోమవారం బాక్సాఫీస్ వద్ద అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నది. ఈ చిత్రం సోమవారం స్టడీగా కలెక్షన్లను రాబట్టగలిగితే.. హిట్ జోన్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా అవుతాయి.


Click it and Unblock the Notifications











