twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Romantic Day 5 Collections: టార్గెట్ కు దగ్గరలో ఉన్న ఆకాష్ పూరి.. ఇంకా ఎంత రావాలంటే?

    |

    పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనిల్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఇక పూరి connects బ్యానర్లో పూరి జగన్నాథ్ అలాగే చార్మి రొమాంటిక్ సినిమాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులు అయితే పాజిటివ్ రెస్పాన్స్ క్రియేట్ చేసింది.

    అంతేకాకుండా సినిమా ప్రముఖులు కూడా ప్రమోషన్లలో పాల్గొనడం తో బాక్సాఫీస్ వద్ద తప్పకుండా సక్సెస్ అవుతుందని అందరూ అనుకొన్నారు అయితే సినిమా మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్స్ అందుకోవడంలో కాస్త నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 5వ రోజు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

    దర్శకుల నుంచి ప్రశంసలు

    దర్శకుల నుంచి ప్రశంసలు

    రొమాంటిక్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఆకాష్ పూరి గత కొంతకాలంగా వరుస ప్రమోషన్స్ తో బిజీగా కనిపించాడు. సినిమాలో రొమాన్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు ట్రైలర్ తోనే అర్థం అయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

    రాజమౌళి నుంచి మెహర్ రమేష్ వరకు దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ దర్శకులు అందరూ కూడా సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. అంతేకాకుండా పాజిటివ్ గా స్పందించడంతో సినిమా ఈజీగా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.

    ప్రభాస్ సహాయం

    ప్రభాస్ సహాయం

    రొమాంటిక్ సినిమాకు ప్రభాస్ నుంచి కూడా మంచి మద్దతు లభించింది. ప్రభాస్ ట్రైలర్ ను లాంచ్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా హీరో హీరోయిన్ తో కలిసి మంచి ఇంటర్వ్యూ కూడా చేశాడు. ప్రభాస్ చేసిన ప్రమోషన్ కూడా ఈ సినిమాకు మంచి హెల్ప్ అయ్యింది.

    ప్రమోషన్ విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన ప్రణాళికలు చాలా వరకు సక్సెస్ కావడంతో మొదటి వారంలోనే సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తుందని అని అందరు అనుకున్నారు. కానీ విడుదల తర్వాత సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక మొదటి రోజు నుంచి కలెక్షన్స్ అయితే తగ్గుతూ వచ్చాయి.

    5వ రోజు వచ్చిన కలెక్షన్స్

    5వ రోజు వచ్చిన కలెక్షన్స్

    రొమాంటిక్ మూవీ వీకెండ్ లోనే అనుకున్నంతగా వసూళ్లను ఏమి రాబట్టలేకపోయింది. ఇక 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగానే వచ్చాయి. ఇక సోమవారం నుంచి స్టాండర్గ్ గానే ఉన్నప్పటికీ కూడా వసూళ్లు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. 4వ రోజు సినిమా కేవలం 32 లక్షల షేర్ ని మాత్రమే అందుకుంది. ఇక 5 వ రోజు అయితే దాదాపు 30% వరకు డ్రాప్ అయ్యింది. దాదాపు 20 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్నట్లు సమాచారం.

    5 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్..

    5 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్..

    5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 1.24 కోట్లు, సీడెడ్‌లో 68 లక్షలు, ఉత్తరాంధ్రతో 44 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 27 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 లక్షలు, గుంటూరులో 28 లక్షలు, కృష్ణా జిల్లాలో 24 లక్షలు, నెల్లూరులో 17 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో 5 రోజుల్లో 3.52 కోట్ల షేర్ రాగా టోటల్ గా 5.65 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

    ప్రపంచ వ్యాప్తంగా..

    ప్రపంచ వ్యాప్తంగా..

    కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాల్లో సినిమా 5 రోజుల్లో 10 లక్షల రూపాయలను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో రొమాంటిక్ సినిమా 8లక్షలతోనే ఆగిపోయింది. వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో 3.70 కోట్ల షేర్ రాబట్టిన రొమాంటిక్ సినిమా రూ.5.90 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

    లాభాల్లోకి రావాలంటే..

    లాభాల్లోకి రావాలంటే..

    రొమాంటిక్ సినిమాకు సోమవారమే వసూళ్లు చాలా తగ్గిపోయాయి. ఈ రకంగా అయినా ఈ వారం గడిస్తే సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ మూవీ రూ.4.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలైంది. ఇక సినిమా లాభాల్లోకి లోకి రావాలి అంటే మొత్తంగా 5 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే ఇప్పటివరకు 3.70 కోట్ల షేర్ సాధించిన రొమాంటిక్ మూవీ ఇంకా 1.3కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

    English summary
    Romantic movie 5 days box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X