‘రొటీన్ లవ్ స్టోరీ’శాటిలైట్ రైట్స్ ఎంతంటే..
కలెక్షన్స్ పరంగా 'రొటీన్ లవ్ స్టోరీ'కి ఇక్కడ ఇండియాలో పెద్దగా కలెక్షన్స్ లేకపోయినా... ప్రస్తుతం అమెరికా బాక్సాఫీసు వద్ద మూడో స్థానంలో నిలిచింది. అక్కడ 13 స్క్రీన్లలో విడుదలైన రొటీన్ లవ్ స్టోరీ తొలి నాలుగు రోజుల్లో రూ. 4.61 లక్షలు($ 8,300) వసూలు చేసింది. గురువారం $ 1,704, శుక్రవారం $ 2,033, శనివారం $ 2,331, ఆదివారం $ 2232 వసూలు చేసింది.
కథ ప్రకారం సంజూ (సందీప్ కిషన్) చాలా సరదాగా జీవితం ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ ఇయిర్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అతను ఆ వయస్సులో అందరిలాగే తన క్లాస్ మేట్ తన్వి (రెజీనా) ప్రేమలో పడతాడు. మొదటి వీరిద్దరూ మంచి స్నేహితుల్లా కొంత కాలం సరదాగా గడుపుతారు. అ తర్వాత ఓ రోజు సంజూ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఆమె తనకు కొంత సమయం కావాలని,ఇద్దరం మరింతగా అర్దం చేసుకోవటానికి ఆ సమయం ఉపయోగిస్తుందని అంటుంది. ఇద్దరిలోనూ పాజిటివ్,నెగిటివ్ లు ఉంటాయి. దాంతో ఆరిలేషన్ షిప్ లో వీరిద్దరూ దగ్గరయ్యారా..లేక వేరు వేరు భావాలతో విడిపోయారా అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎం.ఎస్.నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఝాన్సీ, సురేఖావాణి, తాగుబోతు రమేష్, ప్రగతి, స్వప్నిక, కృష్ణుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్ భార్గవ, పాటలు: కృష్ణ చిన్ని, అనంత శ్రీరామ్, వనమాలి, సంగీతం: మిక్కీజే మేయర్, నిర్మాత: చాణక్య బూనేటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తార్.


Click it and Unblock the Notifications












