Rowdy Boys Closing Collections: పని చేయని అనుపమ లిప్ లాక్.. మొత్తం నష్టాలు ఎంతంటే?

మినిమమ్ హిట్ సినిమాలతో మంచి నిర్మాతగా గుర్తింపు అందుకున్న దిల్ రాజు తన వారసుడి ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నాడు అంటే తప్పకుండా మినిమమ్ గ్యారెంటీ సినిమాను సిద్ధం చేసి ఉంటాడు అని అందరూ అనుకుని ఉంటారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన రౌడి బాయ్స్ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక సినిమా ఫుల్ రన్ తో బాక్సాఫీస్ వద్ద టోటల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంది అనే వివరాల్లోకి వెళితే...

అనుపమ లిప్

అనుపమ లిప్


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ మొదటిసారి అంచనాలకు మించి గ్లామరస్ పాత్రలో నటిస్తోంది. ఏకంగా లిప్ లాక్ సీన్ లో నటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఆమెకు ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకున్నట్లు సమాచారం. లిప్ లాక్ సీన్ తో సోషల్ మీడియాలో కాస్త బజ్ అయితే బాగానే వచ్చింది.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 11 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద 11.50 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చేసింది. ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయాలని నిర్మాత దిల్ రాజు గత రెండేళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఎంతోమంది దర్శకుల నుంచి కథలను విని ఫైనల్ గా హుషారు డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటితో రౌడి బాయ్స్ కథను సిద్ధం చేసి ఉంచాడు. ఇక సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 14న విడుదల చేశారు. పోటీగా వేరే సినిమాలు వచ్చినా కూడా దిల్ రాజు వాళ్ళతో మాట్లాడి మరి పోటీ లేకుండా చేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఎంతంటే?

ఇక ఈ సినిమా ఫుల్ రన్ టైమ్ కలెక్షన్స్ విషయానికి వస్తే..
ఏరియాల వారిగా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.1.83 కోట్లు, సీడెడ్‌లో రూ. 90 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.57 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 5.61 కోట్లు షేర్, రూ. 10.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

టోటల్ కలెక్షన్స్..

టోటల్ కలెక్షన్స్..


మొత్తంగా ఏపీ తెలంగాణలో 5.61 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.11కోట్లు ఓవర్సీస్ లో 0.14 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ గా 5.86 కోట్లు రాగా 11 కోట్లు గ్రాస్ వచ్చాయి. చాలా ఏరియాల్లో దిల్ రాజు ఈ సినిమాను సొంతంగానే రిలీజ్ చేశారు. ఇక సినిమాకు రివ్యూలు కూడా అనుకున్నంత పాజిటివ్ గా ఏమి రాలేవు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద పండగ సీజన్స్ కూడా అనుకున్నంతగా వసూళ్లు రాలేవు.

నష్టాలు ఎంతంటే?

నష్టాలు ఎంతంటే?

బాక్సాఫీస్ వద్ద రౌడి బాయ్స్ సినిమా దిల్ రాజుకి భారీగానే నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాకు బడ్జెట్ కూడా ఎక్కువనే అయ్యింది. ముఖ్యంగా దిల్ రాజు తన వారసుడి కోసం పెద్ద టెక్నీషియన్స్ ను తీసుకువచ్చారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద 11.50కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 5.86కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక థియేట్రికల్ గా 5.64కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X