రిలీజ్ డేటిచ్చారు...'గబ్బర్ సింగ్' లాగ ఆడుతుందా?

By Srikanya

హైదరాబాద్ : గబ్బర్ సింగ్ హిట్ అయిన నాటి నుంచీ ...పోలీస్ కథలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎటు చూసినా పోలీస్ కథలే కనపడుతున్నాయి..హీరోలకు దర్శకులకు అవే నచ్చుతున్నాయి. తాజాగా మరో పోలీస్ స్టోరీ రిలీజ్ కు సిద్దమవుతోంది. నారా రోహిత్‌ హీరోగా నటించిన చిత్రం 'రౌడీ ఫెలో'. విశాఖసింగ్‌ హీరోయిన్. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. చిత్రం హీరో క్యారెక్టర్ ప్రధానంగా సాగుతుందని, గబ్బర్ సింగ్ లాగ చిత్రం ఆడుతుందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా చిత్రంలో డైలాగులు హైలెట్ అవుతాయంటున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఒక పోలీసు కథ ఇది. అతను రౌడీ పోలీసుగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెరపైనే చూడాలి. పాటలకు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభించింది. సినిమా అదే తరహాలో అలరిస్తుంది. నారా రోహిత్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయన సినీ ప్రయాణంలో ఓ మైలురాయిలా నిలుస్తుంది'' అన్నారు.

'Rowdy Fellow' releasing on Nov 21st

అలాగే... ‘‘కొత్తదనంతో కూడిన కథలతో సినిమాలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో ‘రౌడీఫెలో' సినిమా ప్రారంభించాం. ప్రేక్షకుల్ని మెప్పించడమే లక్ష్యంగా పనిచేశాం. పాటలకు, ట్రైలర్‌లకు చక్కని స్పందన వస్తోంది. వైవిధ్యం ఆశించే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది. నారా రోహిత్‌ విభిన్నమైన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.

పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా చక్కదిద్దాడు అనేది సినిమాలో ఆసక్తికరం. నారా రోహిత్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. ఈ నెల 21న విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మాత్రం నిరాశకు గురిచేయదు'' అని అన్నారు.

సినిమా 5 పతాకంపై ప్రకాశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, రావు రమేశ్‌, అజయ్‌, సుప్రీత్‌, పోసాని తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు కెమెరా: ఓం, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X