'విక్రమార్కుడు' హిందీ రీమేక్ రిజల్ట్
రవితేజ,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'విక్రమార్కుడు'. ఈ చిత్రంకు రీమేక్‌గా ప్రభుదేవా 'రౌడీ రాథోర్' చిత్రాన్ని రూపొంది మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓపినింగ్స్ మాత్రం అదరిపోయే రేంజిలో తెచ్చుకుంది. ఇండియాలో దాదాపు పదిహేను కోట్లకు పైగా మొదటి రోజు కలెక్టు చేసి రికార్డు నెలకొల్పింది. అయితే కలెక్షన్స్ ఎంత వరకూ నిలబడతాయో చెప్పటం కష్టం అంటున్నారు. ఈ చిత్రాన్ని అక్కడ మీడియా ఓ పాత కాలం సినిమాగా కొట్టిపారేసింది.
బాలీవుడ్ ట్రేడ్ ఎనాలిటిస్ట్...తరుణ్ ఆదర్శ్ ఈ చిత్రం కలెక్షన్స్ పై ట్వీట్ చేస్తూ...'రౌడీ రాథోర్'..ఇండియాలో శుక్రవారం నెట్ 15.10 కోట్లు వసూలు చేసింది. బిగ్గెస్ట్ నాన్ హాలిడే ఫ్రైడే ఓపినర్ ..అవుట్ స్టాండింగ్ అని ట్వీట్ చేసారు. అయితే అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా కి ఉన్న మార్కెట్..బి,సి సెంటర్ల వద్ద వీరిద్దరికి ఉన్న క్రేజ్ ని తక్కువ అంచనావేయలేం అంటున్నారు. అందులోనూ చాలా కాలం గ్యాప్ తర్వాత అక్షయ్ కుమార్ ఇలా యాక్షన్ చిత్రంలో కనిపించటం కూడా భాక్సాఫీస్ ని ఆనందపరుస్తోంది.
ఈ చిత్రంలో జింతాకా..పాటకు గానూ సౌత్ సూపర్ స్టార్ హీరో తీసుకున్నారు. తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్. అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న 'రౌడీ రాథోర్'లో ఓ పాటలో అతను స్పెషల్ అప్పీరెన్స్‌గా నటించాడు. ముంబైలోని ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించిన ఈ పాటలో రెండు రోజుల పాటు పాల్గొన్న విజయ్ ఉచితంగానే నటించారు. నిర్మాతలు రెమ్యునేషన్ చెల్లించడానికి సిద్ధమైనా విజయ్ దాన్ని సున్నితంగా తోసిపుచ్చి వార్తల్లో కెక్కాడు.
ఇక ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఓ రేంజి బిజినెస్ జరిగిందని సమాచారం. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పినట్లు చెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేసింది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా చాలా రోజులు పాటు స్క్రిప్టు పై కసరత్తులు చేసి తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











