'రౌడీ' US లో మూడు రోజుల కలెక్షన్స్ ఇవే..
హైదరాబాద్ : మోహన్‌బాబు - రామ్‌గోపాల్ వర్మ కలయికలో రూపొందిన 'రౌడీ' అనే సినిమా మొన్న శుక్రవారం విడుదలైంది. డివైడ్ టాక్ తో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బాగానే ఉందనేది ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
US లో ఈ చిత్రం మూడు రోజులు కలెక్షన్స్
ప్రీమియర్ షో: $9,629
శుక్రవారం : $30,426
శనివారం: $31,092
మొత్తం మూడు రోజులు : $71,146
గమనిక: ట్రేడ్ లో వినపడుతున్న అంకెలు మాత్రమే.. ఇవి ఖచ్చితమైనవని చెప్పలేము

మోహన్ బాబు మాట్లాడుతూ... '' 'రౌడీ'ని చూసి అందరూ ఇది మోహన్‌బాబు వన్‌మ్యాన్ షో అంటున్నారు. ఇది నా షో కాదు. మా చిత్రబృందం అందరి షో. అందరినీ ముందుండి నడిపించిన వర్మ షో. సినిమాని ముందుగా అనుకున్నట్లే 30 రోజుల్లో పూర్తి చేశాడు. అనుకున్న బడ్జెట్‌లో రూ.56 లక్షలు మిగిలాయి. నేను గతంలోనూ అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ చిత్రాల్ని 20-30 రోజుల్లోనే చేశాను. కానీ ఈ సినిమా ప్రత్యేకం'' అన్నారు
అలాగే ...''రామ్‌గోపాల్‌వర్మ పనితనం చూసి, కొందరి ద్వారా తెలుసుకొని పదేళ్ల కిత్రమే ఒకసారి నాతో సినిమా చేయమని అడిగాను. కానీ కుదర్లేదు. ఈ విషయాన్ని నేనే మరచిపోతున్న రోజుల్లో ఒకసారి విష్ణు వచ్చి 'రామ్‌గోపాల్‌వర్మ నిన్ను కలవడానికి ఇంటికి వస్తున్నారు' అన్నాడు. అలా వర్మని కలిశాను. తర్వాత మూడు రోజుల్లోనే కథని సిద్ధం చేసి తెచ్చాడు. నచ్చి సరే అన్న రెండు రోజులకే మొత్తం నటీనటుల జాబితా, ఎలా, ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరణ జరపాలో ప్రణాళిక కూడా తెచ్చుకున్నాడు. అంత పక్కాగా ఉంటాడు వర్మ.'' అని చెప్పారు.
ఇక ''ఈ సినిమా కథతో రామ్‌గోపాల్‌వర్మ వచ్చినప్పుడు నాకున్న ఆలోచన ఒక్కటే. నేనేంటో, నా నటనేంటో ఇప్పటికే అందరికీ తెలుసు. నేనేదో ఇప్పుడు కొత్తగా చూపించక్కర్లేదు. విష్ణుని పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా చూడాలనుకున్నాను. అది వర్మ చేసి చూపించాడు. కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. గంగోత్రి విశ్వనాథ్ రాసిన సంభాషణలకు స్పందన బాగుంది. ఈ సినిమాలో అన్న పాత్రకి నిజ జీవితంలో నాకూ పెద్ద తేడా ఉండదు. ఇద్దరం అన్యాయాన్ని సహించం. కుటుంబం కోసం, సమాజం కోసం ఎక్కువగా ఆలోచిస్తాం.'' అన్నారు.


Click it and Unblock the Notifications











