twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపటి నుంచే 'ఆర్.ఆర్.ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్' ఎత్తేవేత

    By Srikanya
    |

    చిత్ర పరిశ్రమలోకి ఓ ప్రభంజనంలా వచ్చి వరసగా పెద్ద సినిమాలు చేస్తున్న సంస్ధ ఆర్.ఆర్.మూవీ మేకర్స్. వారి డిస్ట్రిబ్యూషన్ సంస్ధ..ఆర్.ఆర్.ఫిల్మ్ డిస్టిబ్యూటర్. ఈ వింగ్ ని త్వరలో ఆంధ్రాలో క్లోజ్ చేస్తున్నారని సమాచారం. వారు వైజాగ్, రాజమండ్రిలో ఆఫీసులు తెరిచారు. నార్త్ ఆంధ్ర, గోదావరి జిల్లాలను కవర్ చేసే ఈ ఆఫీసులు ను జూన్ 1 నుంచి క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలు మాత్రం తెలియరావటం లేదు.

    రాబోయో రోజుల్లో సీడెడ్, నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా తీసివేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ సంవత్సరం వారి సంస్ధ నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్, పూల రంగడు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కమర్షియల్ గా హిట్ అయ్యి బాగా సంపాదించాయి. గత సంవత్సరం వారు రిలీజ్ చేసిన నాగచైతన్య దడ చిత్రం మాత్రం తీరని నష్టం తెచ్చిపెట్టిందని తెలుస్తోంది.

    ప్రస్తుతం ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు నాగార్జునతో ఢమురకం చిత్రం పూర్తి చేసి బిజినెస్ పనిలో ఉన్నారు. భారీ బడ్జెట్ అయిన ఈ చిత్రం బిజినెస్ చాలా కష్టంగా ఉందని సమాచారం. నాగార్జున, అనూష్క కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీనివాస రెడ్డి డైరక్ట్ చేసారు. చిన్న చిన్న కామెడీ సినిమాలు చేసుకునే శ్రీనివాస రెడ్డికి ఇదే మొదటి భారీ చిత్రం. గ్రాఫిక్స్ తో సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందింది.

    ఇక ఈ చిత్రంతో పాటు నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా ఆటో నగర్ సూర్య చిత్రం తెరకెక్కుతోంది. దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రారంభమైన చాలా కాలమైనా షూటింగ్ పూర్తి కాలేదు. వీటితో పాటు రవిచావలి దర్సకత్వంలో బాలకృష్ణ హీరోగా శ్రీమన్నారాయణ చిత్రం,నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో పైసా చిత్రం రూపొందుతున్నాయి. ఈ చిత్రాల హిట్ రేంజిపై ఈ సంస్ధ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు.

    English summary
    
 RR Film Distributors, the Distribution wing of RR Movie Makers will be shutting their shop in Andhra. They operate 2 offices in Vizag & Rajamundry covering North Andhra & Godavari Districts which cease to exist from June 1 The reasons behind the decision are yet to be known but in the coming days even Ceeded & Nizam operations might be shelved.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X