twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 1st week collections in Japan.. రాజమౌళి మూవీ అరుదైన రికార్డు. జపాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమారం

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన RRR చిత్రం జపాన్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. జపాన్‌లో అరుదైన రికార్డులతో తొలివారాన్ని దిగ్విజయంగా ముగించింది. రెండోవారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటి వరకు RRR సాధించిన రికార్డులు, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    100 మిలియన్ వ్యూస్‌తో

    100 మిలియన్ వ్యూస్‌తో

    RRR మూవీ ట్రైలర్ ఇటీవల భారీ రికార్డును అందుకొన్నది. ఈ ట్రైలర్ తాజాగా 100 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది. 2021, డిసెంబర్ 09 తేదీన రిలీజైన ఈ ట్రైలర్.. ఐదు భాషల్లో 100 మిలియన్ల వ్యూస్‌ను యూట్యూబ్‌లో సొంతం చేసుకొన్నది. హిందీలో 52 మిలియన్లు, తెలుగులో 36 మిలియన్లు, కన్నడలో 7.2 మిలియన్లు, తమిళంలో 7 మిలియన్లు, మలయాళంలో 3.5 మిలియన్ల వ్యూస్ సాధించింది.

    జపాన్‌లో RRR థియేటర్ కౌంట్

    జపాన్‌లో RRR థియేటర్ కౌంట్


    ఇక అక్టోబర్ 21వ తేదీన జపాన్‌లో RRR మూవీ రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజైంది. జపాన్‌లో 44 నగరాల్లో 209 స్క్రీన్లలో, 31 ఐమాక్స్ స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మొదటి నుంచే భారీగా స్పందన వ్యక్తమవుతున్నది. అయితే ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన ముత్తు చిత్రం JPY400 మిలియన్లు సాధించింది. అంటే భారతీయ కరెన్సీలో 22 కోట్లు రాబట్టింది.

    జపాన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో స్థానమంటే?

    జపాన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో స్థానమంటే?

    RRR చిత్రం జపాన్‌ బాక్సాఫీస్ వద్ద 10వ స్థానంలో చోటును సంపాదించుకొన్నది. మిగితా తొమ్మిది సినిమాలు స్థానిక జపాన్ సినిమాలు కావడం గమనార్హం. అయితే జపాన్ సినిమాలకు మించి భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ది బ్యాడ్ గయ్స్, స్పెన్సర్, జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాలకు మించి వసూళ్లను రాబడుతున్నది.

    జపాన్‌లో వారం తర్వాత

    జపాన్‌లో వారం తర్వాత


    ఇక జపాన్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను RRR నమోదు చేస్తున్నది. తాజా సమాచారం ప్రకారం జపాన్‌లో ఆ దేశపు కరెన్సీ (యెన్) ప్రకారం.. 100 మిలియన్లు వసూళ్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో 5.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కొనసాగుతున్నది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?

    RRR చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దేశ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఇక ఉత్తర అమెరికాలో 14.5 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 1014 కోట్లకుపైగా వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఇక జపాన్ కలెక్షన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1200 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇంకా నిలకడగా కలెక్షన్లను రాబడుతుండటంతో మరికొన్ని రికార్డులను అధిగమించే అవకాశం ఉంది.

    English summary
    SS Rajamouli's RRR movie has released October 21st in Japan. Here are the 1st week collection of Ram Charan, Jr NTR's movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X