RRR 21 days Collections.. KGF 2 ప్రభంజనాన్ని తట్టుకొని భారీ కలెక్షన్లు.. తగ్గని రాజమౌళి క్రేజ్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన RRR మూవీ 21వ రోజున కూడా నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. KGF Chapter 2 ప్రభంజనాన్ని తట్టుకొని ఈ సినిమా మంచి వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. మూడో వారంలో కూడా ఈ సినిమా స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధించడం విశేషంగా మారింది. RRR చిత్రం 21వ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందా అనే వివరాల్లోకి వెళితే..

RRR మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

RRR మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

RRR చిత్రానికి భారీ క్రేజ్ లభించడంతో విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 191 కోట్లు, కర్ణాటక 41 కోట్లు, తమిళనాడులో 35 కోట్లు, కేరళలో 9 కోట్లు, హిందీలో 92 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 8 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో 75 కోట్ల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమా 451 కోట్ల మేర బిజినెస్ చేయగా.. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా 21వ రోజు వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా 21వ రోజు వసూళ్లు

గత రెండు వారాలుగా గట్టి పోటీ లేకుండా RRR బాక్సాఫీస్ జర్నీ సాఫీగా జరిగిపోయింది. మూడో వారంలో ఈ సినిమాకు కేజీఎఫ్ చాప్టర్ 2, బీస్ట్ మూవీస్ అడ్డంకిగా నిలిచాయి. అయితే ఈ రెండు చిత్రాల క్రేజ్‌ను తట్టుకొని 21వ రోజున ఈ సినిమా 6.65 కోట్ల గ్రాస్, 2.91 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

 ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్లు

ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్లు

RRR మూవీ నైజాం, ఆంధ్రాలో 21వ రోజు సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 41 లక్షలు, సీడెడ్‌లో 18 లక్షలు, ఉత్తరాంధ్రలో 10 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షలు, గుంటూరులో 5 లక్షలు, కృష్ణా జిల్లాలో 5 లక్షలు, నెల్లూరు జిల్లాలో 4 లక్షలు వసూలు చేసింది. దాంతో 21వ రోజున ఏపీ, తెలంగాణలో 1.5 కోట్ల గ్రాస్, 96 లక్షల నికర వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే?

RRR చిత్రం గత 21 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 393 కోట్ల గ్రాస్ వసూళ్లు, 261 కోట్ల నికర వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 42 కోట్లకుపైగా, తమిళనాడులో 37.20 కోట్లకుపైగా, కేరళలో 10.27 కోట్లకుపైగా, హిందీలో 120 కోట్లకుపైగా, మిగితా రాష్ట్రాల్లో వివిధ వెర్షన్లకు కలిపి 8.75 కోట్లు, ఓవర్సీస్‌లో 96 కోట్ల గ్రాస్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం 1057 కోట్ల గ్రాస్ వసూళ్లు, 576 కోట్లకుపైగా నికర వసూళ్లను నమోదు చేసింది.

Recommended Video

KGF Chapter 2 సంచలనం ..RRR,హాలీవుడ్ మూవీ కూడా వెనక్కే..| Oneindia Telugu
RRR ఏ రేంజ్ హిట్ అంటే..

RRR ఏ రేంజ్ హిట్ అంటే..

RRR చిత్రం 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ నమోదు చేయడం.. 453 కోట్ల బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో జైత్రయాత్రను మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా 576 కోట్ల షేర్ నమోదు చేసింది. అంటే ఈ చిత్రం ఇప్పటికే 123 కోట్ల మేర లాభాలను పంచింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X