RRR Collections: అప్పుడే సంచలన రికార్డు.. హైదరాబాద్‌లో అన్ని కోట్లు.. అక్కడ కూడా హవా

కొన్నేళ్ల క్రితం వచ్చిన 'బాహుబలి' మూవీ సిరీస్ తర్వాత తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అప్పటి నుంచి టాలీవుడ్‌లో భారీ ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో భారీ చిత్రం రిలీజ్ అయిపోయింది. అదే.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగులోనే కాదు.. ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో అప్పుడే ఈ సినిమా అదిరిపోయే రికార్డును కొట్టేసింది. ఆ వివరాలేంటో మీరూ చూడండి!

ఆ ముగ్గురి కలయికలో మ్యాజిక్

ఆ ముగ్గురి కలయికలో మ్యాజిక్

టాలీవుడ్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.

అంచనాలకు తగ్గట్లు విడుదల

అంచనాలకు తగ్గట్లు విడుదల

మొదటి నుంచే RRR మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం క్రియేట్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనూ రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనూ రికార్డ్

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 190 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లకు అమ్ముడయ్యాయి.

రేట్లు పెంపు.. బుకింగ్స్ ఫుల్లుగా

రేట్లు పెంపు.. బుకింగ్స్ ఫుల్లుగా

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి టికెట్ రేట్ల తగ్గింపు అనే అంశం ప్రతిబంధకంగా మారిన విషయం తెలిసిందే. అయితే, RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ విషయంలో ఆ అడ్డంకులు తొలిగిపోయాయి. ఏపీలో రేట్లు పెంచుకునే వెసలుబాటును ప్రభుత్వం కల్పించింది. అలాగే, చాలా ఏరియాల్లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా.. అన్ని చోట్ల ఇప్పటికే టికెట్లన్నీ సేల్ అయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు

అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ బజ్‌ను ఏర్పరచుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది వేల రూపాయలు పలుకుతోంది. ఏరియాను బట్టి 2000 - 3000 వరకూ టికెట్ల రేట్లను డిసైడ్ చేశారు. దీనితో పాటు ఇండియాలోని చాలా ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్‌ భారీగా జరిగాయి.

హైదరాబాద్‌లో అన్ని కోట్లు

హైదరాబాద్‌లో అన్ని కోట్లు

అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో హైదరాబాద్‌ సిటీలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి అతి భారీ రెస్పాన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కేవలం దీని ద్వారా ఒక్క భాగ్యనగరంలోనే రూ. 9.86 కోట్లు వసూలు చేసిందట ఈ సినిమా. టాలీవుడ్ హిస్టరీలో ఏ సినిమా కూడా ఈ మార్కును చేరుకోలేదు. దీంతో అప్పుడే ఈ సినిమా ఓ రికార్డును ఖాతాలో వేసుకుంది.

Recommended Video

RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu
12 సిటీల్లో 22 కోట్లకు పైగానే

12 సిటీల్లో 22 కోట్లకు పైగానే

అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హైదరాబాద్‌లో రూ. 9.86 కోట్లు రాబట్టిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ.. బెంగళూరులో రూ. 5.97 కోట్లు, చెన్నైలో రూ. 2.04 కోట్లు, అహ్మదాబాద్‌లో రూ. 32 లక్షలు, ముంబైలో రూ. 1.34 కోట్లు, జైపూర్‌లో రూ. 27 లక్షలు, ఢిల్లీలో రూ. 1.24 కోట్లు, పూణెలో రూ. 43 లక్షలు, కొచ్చిలో రూ. 29 లక్షలు, సూరత్‌లో రూ. 33 లక్షలు, లక్నోలో రూ. 17 లక్షలు, భువనేశ్వర్‌లో రూ. 30 లక్షలతో కలుపుకుని మొత్తంగా రూ. 22.56 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X