RRR Business: ఒక్క తెలుగులోనే 200 కోట్లకు పైగా.. ఆ ఏరియాలోనే ఎక్కువ.. హిట్ అవ్వాలంటే ఎంత రావాలంటే!

'బాహుబలి' మూవీ తర్వాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయిందన్న విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే టాలీవుడ్‌లో భారీ ప్రతిష్టాత్మక చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో భారీ చిత్రం విడుదల కాబోతుంది. అదే.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం).

తెలుగులోనే కాదు.. ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో దీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియాల థియేట్రికల్ రైట్స్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. షాకయ్యేలా ఉన్న ఆ లెక్కలపై మీరూ లుక్కేయండి!

ఆ ముగ్గురి కలయికలో ఆర్ఆర్ఆర్

ఆ ముగ్గురి కలయికలో ఆర్ఆర్ఆర్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు. ఇది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రికార్డులతో అంచనాలూ భారీగానే

రికార్డులతో అంచనాలూ భారీగానే

ఆరంభం నుంచే RRR మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా స్పందన దక్కింది. అలాగే, ఈ చిత్రంలోని పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం క్రియేట్ అయిపోయాయి.

టికెట్ రేట్ల పెంపు.. బుకింగ్స్ జోరు

టికెట్ రేట్ల పెంపు.. బుకింగ్స్ జోరు

కొంత కాలగా తెలుగు సినీ ఇండస్ట్రీకి టికెట్ రేట్ల తగ్గింపు అనే అంశం ప్రతిబంధకంగా మారిన విషయం తెలిసిందే. అయితే, RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ విషయంలో ఆ అడ్డంకులు తొలిగిపోయాయి. ఏపీలో రేట్లు పెంచుకునే వెసలుబాటును ప్రభుత్వం కల్పించింది. అలాగే, చాలా ఏరియాల్లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా.. అన్ని చోట్ల ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.

 ప్రీ రిలీజ్ బిజినెస్‌లో మార్పులతో

ప్రీ రిలీజ్ బిజినెస్‌లో మార్పులతో

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ క్రమంలోనే అన్ని ఏరియాల్లోనూ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోయాయి. అయితే, పలుమార్లు విడుదల తేదీలు మారడం.. జీఎస్టీ యాడ్ అవడం.. టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా బిజినెస్‌లో మార్పులు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 211 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 211 కోట్లు

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి నైజాంలో రూ. 75 కోట్లు, సీడెడ్‌లో రూ. 45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 23 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 13 కోట్లు, గుంటూరులో రూ. 17 కోట్లు, కృష్ణాలో రూ. 14 కోట్లు, నెల్లూరులో రూ. 9 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 211 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది.

బాహుబలి కంటే డబుల్ బిజినెస్

బాహుబలి కంటే డబుల్ బిజినెస్

టాలీవుడ్ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా RRR (రౌద్రం రణం రుధిరం) రికార్డును క్రియేట్ చేసింది. దీనికి రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 211 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు (122 కోట్లు) బద్దలైంది. ఈ జాబితాలో సాహో (121.6 కోట్లు), సైరా (106.08 కోట్లు), రాధే శ్యామ్ (105.02 కోట్లు) టాప్ 5లో ఉన్నాయి.

Recommended Video

RRR Pre Release Event : జనసేన జెండా కిందపడేసి NTR ను ఎగరేసి Mega Vs Nandamuri | Oneindia Telugu
ఎన్ని కోట్లొస్తే హిట్ అవుతుందంటే

ఎన్ని కోట్లొస్తే హిట్ అవుతుందంటే

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకుంది. ఇది నైజాం సహా చాలా ఏరియాల్లో ఆల్‌టైం రికార్డును క్రియేట్ చేసింది. ఇక, మొత్తంగా ఈ మూవీ రూ. 211 కోట్లు ప్రీ రిలీజ్ బిజనెస్‌ను జరుపుకోగా.. రూ. 213 కోట్లు వస్తే ఇది హిట్ అయినట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ఏరియాల రైట్స్ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X