RRR అడ్వాన్స్ బుకింగ్స్.. పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ రికార్డ్ బ్రేక్ చేసిన తారక్, చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్టమొదటి బిగ్గెస్ట్ మూవీ RRR ఈ శుక్రవారం భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఇదివరకే పవన్ కళ్యాణ్ సెట్ చేసిన రికార్డును కూడా ఈ ఇద్దరు హీరోలు బ్రేక్ చేయడం విశేషం. ఆ రికార్డుల వివరాల్లోకి వెళితే..

Recommended Video

RRR : Advance Bookings తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న RRR
బాలీవుడ్ కు ధీటుగా..

బాలీవుడ్ కు ధీటుగా..

ఇటీవల కాలంలో తెలుగులో అగ్ర హీరోలు ప్రతి సినిమాతో కూడా ఏదో ఒక రికార్డును బ్రేక్ చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ మార్కెట్ బాలీవుడ్ మార్కెట్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా పెరుగుతోంది అనే చెప్పాలి. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే మన అగ్రహీరోలు ప్రతిసారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్స్ తోనే బిజినెస్ స్థాయిని పెంచుకుంటున్నారు అని చెప్పాలి.

పవన్ రికార్డ్

పవన్ రికార్డ్

ఇక నైజాం ఏరియాలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ముఖ్యంగా హైదరాబాద్ లో పవర్ స్టార్ ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 6.17 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించగా మంచి హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే.

బ్రేక్ చేసిన చరణ్ తారక్

బ్రేక్ చేసిన చరణ్ తారక్

హైదరాబాద్ ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ తో నెంబర్ వన్ రికార్డును అందుకున్న పవన్ కళ్యాణ్ రికార్డును ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చాలా తొందరగానే బ్రేక్ చేయడం విశేషం. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR సినిమా మరో రెండు రోజుల్లో విడుదల అవుతుండగా ముందుగానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో 6.42 కోట్లను అందుకుంది. దాదాపు 633 షోలకు సంబంధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నట్లు సమాచారం..

ఫస్ట్ డే సాలీడ్ వసూళ్లు పక్కా..

ఫస్ట్ డే సాలీడ్ వసూళ్లు పక్కా..

చూస్తుంటే RRR సినిమా విడుదలయ్యే ముందు రోజు వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా మొదటి రోజు తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లోనే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కుదిరితే అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు అనే సమాచారం. ఒక విధంగా తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలని ఎగబడి బుక్ చేసుకుంటున్నారు.

టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో..

టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో..

రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య దాదాపు 500కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇక వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన RRR సినిమా ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X