RRR Day 2 Collections : సినీ చరిత్రలో అరుదైన రికార్డు.. బాహుబలి రికార్డును ఒకే ఏరియా కలెక్షన్స్ తో బద్దలు!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా రికార్డుల ఊచకోత ప్రారంభించింది. సినిమా విడుదలకు ముందే అనేక విషయాలలో రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళ్తున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా సరికొత్త రికార్డులు రాస్తూ ముందుకు వెళుతుంది. బాహుబలి కలెక్షన్స్ ఇప్పటి వరకు మరో దర్శకుడు బద్దలు కొట్టలేకపోయారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా రికార్డులు కూడా రాజమౌళి స్వయంగా బద్దలు కొట్టాల్సిందే తప్ప మళ్ళీ వేరేవారికి అవకాశం లేదని అంటున్నారు.. తాజాగా RRR సినిమా సృష్టించిన రికార్డు టాలీవుడ్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

చరిత్రలో కలవని ఈ ఇద్దరూ

చరిత్రలో కలవని ఈ ఇద్దరూ

జక్కన్నగా పేరు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రధారులుగా నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించారు. అసలు చరిత్రలో కలవని ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అని ఒక కల్పిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.

450 కోట్ల రూపాయలతో

450 కోట్ల రూపాయలతో

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటించగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. భారీ బడ్జెట్ తో సుమారు 450 కోట్ల రూపాయలతో ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు.

సరికొత్త రికార్డు

సరికొత్త రికార్డు

ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, చత్రపతి శేఖర్, మకరంద్ దేశ్ పాండే వంటి అనేకమంది టాలెంటెడ్ నటీనటులు నటించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్ల పరంగా అనేక రికార్డులను కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా టాలీవుడ్ పరంగా ఒక సరికొత్త రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు.

బాహుబలి 2 సినిమా రికార్డు

బాహుబలి 2 సినిమా రికార్డు

ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం టాలీవుడ్ లో సెకండ్ డే ఆల్ టైం హైయెస్ట్ షేర్ సాధించిన సినిమాగా బాహుబలి 2 నిలిచింది.. ఈ సినిమా అప్పట్లో 14 కోట్ల 80 లక్షల రూపాయలు వసూలు సాధించి టాలీవుడ్లోనే రెండోరోజు భారీ కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా రికార్డును ఇప్పుడు RRR బద్దలు కొట్టేసింది. RRR మూవీ బాహుబలి 2 సినిమా రికార్డును కేవలం ఒకే ప్రాంతం కలెక్షన్లతో బద్దలు కొట్టింది.

ఒకే ప్రాంతంతో

ఒకే ప్రాంతంతో

తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నైజాం ప్రాంతంలో రెండో రోజు దాదాపు 15 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ వసూలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల కంటే RRR సినిమా నైజాం ప్రాంతంలో సాధించిన కలెక్షన్లు ఎక్కువగా ఉండనున్నాయి.. ఒకరకంగా ఇది టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా చెప్పవచ్చు. మరి చూడాలి ఈ సినిమా మున్ముందు ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతూ సంచలన కలెక్షన్లు సాధిస్తూ ముందుకు వెళుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X