RRR collections in Japan తొలి రోజే ప్రభాస్ మూవీ రికార్డు బ్రేక్.. జపాన్‌లో కలెక్షన్ల వర్షం!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టించింది. విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల వర్షం కురిపించింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రాన్ని ఇటీవల జపాన్‌లో విడుదల చేశారు. అయితే జపాన్‌లో RRR చిత్రానికి ఊహించని వసూళ్లు లభిస్తున్నాయి. ఈ సినిమా తొలి వారాంతపు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

RRR మూవీకి జపాన్‌లో అపూర్వ ఆదరణ
జపాన్‌లో RRR సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, రాంచరణ్ దంపతులు వెళ్లిన విషయం తెలిసిందే. జపాన్‌లో రాంచరణ్‌కు స్థానిక అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మెగా పవర్ స్టార్‌కు బహుమతులు, విందుల్లో ముంచెత్తారు. RRR మూవీకి ఊహించిన ప్రేక్షకాదరణ లభించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమా జపాన్‌లో అక్టోబర్ 21న రిలీజైంది.

అత్యధిక లొకేషన్లలో RRR రిలీజ్
జపాన్‌లో ఏ భారతీయ సినిమా కూడా రిలీజ్ కాని విధంగా RRR మూవీ విడుదలైంది. RRR చిత్రం జపాన్‌లో రికార్డు స్థాయిలో 210 లొకేషన్లలో రిలీజైంది. ఒక భారతీయ సినిమాకు ఇదే అత్యధికంగా విడుదలైన ఘనతను సంపాదించుకొన్నది. గతంలో జపాన్‌లో విడుదలైన మూడు సినిమాల రికార్డులను తిరగరాసేందుకు RRR సిద్ధమైంది.

ప్రభాస్ మూవీ రికార్డు బ్రేక్
RRR చిత్రం జపాన్‌లో రికార్డుల పరంపర మొదలుపెట్టింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం సాధించిన కలెక్షన్లను అధిగమించింది. తొలి రోజున సాహో చిత్రం 90 లక్షలు వసూలు చేస్తే.. RRR మాత్రం తొలి రోజున 1.06 కోట్లు వసూలు చేసింది. తొలి రోజే ప్రభాస్ రికార్డును RRR వెనక్కి నెట్టింది.

RRR మూవీ 3 రోజుల కలెక్షన్లు
RRR చిత్రం జపాన్‌లో భారీగా, నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజున అంటే శుక్రవారం రూ.1.06 కోట్లు, రెండో రోజున అంటే శనివారం 1.33 కోట్లు, మూడో రోజున అంటే ఆదివారం 1.22 కోట్లు రాబట్టింది. సోమవారం నాలుగో రోజున మరో 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. దీంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లో 4 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది.

చైనాలో RRR రిలీజ్‌కు సన్నాహాలు
RRR చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నాలుగో స్థానంలో నిలిచింది. బాహుబలి2, దంగల్ చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక కేజీఎఫ్2 చిత్రం మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం RRR చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చైనాలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే చైనాలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











