RRR : హిందీలో ఆ రెండు సినిమాలను కూడా నెట్టి టాప్ గ్రాసర్ ప్లేస్ కి.. కేవలం ఐదే రోజుల్లో రికార్డు
బాహుబలితో తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పిన రాజమౌళి ఊహల నుంచి పుట్టుకొచ్చిన సరికొత్త విజువల్ వండర్ RRR. తెలుగులో ఇద్దరు టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుని ముందుకు వెళుతుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో అనేక రికార్డులు బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. తాజాగా ఆ సినిమా బాలీవుడ్ సినిమాలు గంగూబాయి కతియావాడి, ధీ కాశ్మీర్ ఫైల్స్ నెట్టింది. ఆ వివరాలు
Recommended Video


RRR మేనియా
దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇక, ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమురం భీం పాత్రలలో నటించగా అజయ్ దేవగన్, శ్రేయ శరన్, సముద్రఖని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

తెలుగు విషయానికి వస్తే
RRR బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. ముందుగా తెలుగు విషయానికి వస్తే 5వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 13.63 కోట్లు షేర్, రూ. 20.45 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక ఇదే సినిమాకు 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఫలితంగా నైజాంలో రూ. 68.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 34.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.32 కోట్లు, ఈస్ట్‌లో రూ. 10.41 కోట్లు, వెస్ట్‌లో రూ. 9.17 కోట్లు, గుంటూరులో రూ. 13.32 కోట్లు, కృష్ణాలో రూ. 10 కోట్లు, నెల్లూరులో రూ. 5.88 కోట్లతో కలుపుకుని రూ. 170.63 కోట్లు షేర్, రూ. 253.10 కోట్లు గ్రాస్ సాధించింది.

100 కోట్ల క్లబ్‌లోకి
ఇక ఈ సినిమా నార్త్ బెల్ట్‌లో ఈరోజు మార్చి 30న రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ పీరియాడికల్ డ్రామా కేవలం ఐదు రోజుల్లోనే మూడు అంకెల వసూళ్ల మార్క్‌ను దాటడం చూస్తే ఇది ఒక భారీ అచీవ్‌మెంట్. ఈ సినిమా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్, అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమాల కలెక్షన్స్ ను కూడా అధిగమించి 2022లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన సినిమాగా నిలిచింది.

అత్యంత వేగంగా
బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్, 2.0, పుష్ప: ది రైజ్ తర్వాత, RRR హిందీ బెల్ట్‌లో బాక్సాఫీస్‌ను రాక్ చేసిన ఐదవ సౌత్ చిత్రంగా నిలిచింది. ది కాశ్మీర్ ఫైల్స్ మరియు గంగూబాయి కతియావాడిని అధిగమించి 2022లో రూ. 100 కోట్ల క్లబ్‌లో అత్యంత వేగంగా ప్రవేశించిన సినిమాగా నిలిచింది.

ఐదు రోజుల్లోనే
ఈ మైలురాయిని సాధించడానికి ది కాశ్మీర్ ఫైల్స్ కి ఎనిమిది రోజులు, గంగూబాయి కతియావాడికి 13 రోజులు పట్టాయి. అయితే RRR హిందీ ఆల్-ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు దాటింది అది కూడా 5 రోజుల్లోనే. కానీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ మాత్రం 91.50 కోట్లు వసూలు చేసిందని ఈరోజుతో 100 కోట్లు సాదిస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











