హైదరాబాద్ RRR డిస్ట్రిబ్యూటర్స్ అరాచకం.. బ్లాక్ చేసి మరీ అమ్మకాలు.. దిమ్మతిరిగేలా రేట్లు!
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR సినిమా సందడి మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో మొదలు కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్ లతో దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని థియేటర్స్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేకంగా బ్లాక్ చేసుకొని టికెట్లను భారీ ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. చాలా థియేటర్స్ లో టికెట్లను బ్లాక్ చేసి మరి భారీ ధరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఇక ఒక్కో టికెట్ ఎంత అమ్ముతున్నారు అనే విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆ వివరాల్లోకి వెళితే..

అన్ని రకాల అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం
సాధారణంగా పెద్ద సినిమాలు వస్తే ప్రభుత్వాలు వాటికి ప్రత్యేకంగా టికెట్ల రేట్లు విషయంలో అనుకూలంగా ఉండేలా ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. అంతే కాకుండా ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు స్పెషల్ షో లో అనడమే కాకుండా అదనపు షోలకు కూడా అనుమతులు ఇస్తుండడం విశేషం. ఇక RRRకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో కాస్త చేదు అనుభవం మిగిల్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం RRR కు ఇవ్వాల్సిన అన్ని రకాల అనుమతులు ఇచ్చేసింది.

టికెట్లు బ్లాక్ చేసి మరీ..
అయితే తెలంగాణ హైదరాబాద్ లో అన్ని రకాల అనుమతులు ఇచ్చినప్పటికి డిస్ట్రిబ్యూటర్స్ స్వయంగా టికెట్లు బ్లాక్ చేసి మరీ భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టికెట్ల రేట్లు భారీగా ఉండడంతో కొంతమంది ప్రేక్షకులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ క్లాస్ ప్రేక్షకులు ఇది భారీ ధరలు అని చెప్పాలి. సాధారణంగా ఒక కుటుంబం లో నలుగురు మల్టీప్లెక్స్ లో RRR సినిమాకి వెళితే రెండు వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అక్రమంగా బిజినెస్
ప్రస్తుతం RRR కు ఉన్న డిమాండ్ ను బట్టి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఊహించని విధంగా అక్రమంగా బిజినెస్ చేసుకుంటున్నారు. చాలా వరకు హైదరాబాద్ లో రేపటి షోలకు సంబంధించిన టికెట్లను బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఇక బయట వాటిని భారీ ధరకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో టిక్కెట్టు రూ.3000
ప్రస్తుతం హైదరాబాదులో సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్ లలో కూడా డిస్ట్రిబ్యూటర్లు స్వయంగా టికెట్లను బ్లాక్ చేసి పెట్టి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కో టికెట్ ధర దాదాపు మూడు వేలకు అమ్ముడుపోతున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్స్ కు సంబంధించిన వారితోనే ఈ తరహా దందాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ నాయకుల అండతోనే
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహాలో దందా కొనసాగుతోంది. ఇక అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధమైంది. ఇదివరకే భీమ్లా నాయక్ సినిమాకు ఎలాగైతే ప్రభుత్వ అధికారులతో పోలీసులతో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారో అలాగే ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. అయితే కొంత మంది రాజకీయ నాయకులు అండతోనే డిస్ట్రిబ్యూటర్లు ఈ తరహాలో ఎక్కువ ధరలకు టికెట్లు అమ్ముతున్నట్లుగా సమాచారం.
Recommended Video


ప్రస్తుతం టెక్నాలజీ
ప్రస్తుతం కొనసాగుతున్న టెక్నాలజీ పరంగా చాలా వరకు ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి టికెట్లు తీసుకోవడం లేదు సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టిప్లెక్స్ లలో కూడా టిక్కెట్లు ఆన్లైన్ లోనే ఉండడంతో అడ్వాన్స్ బుక్ చేసుకొని వెళుతున్నారు. ఒక విధంగా కొత్త సినిమాల కోసం థియేటర్స్ ముందు పడిగాపులు కాకుండా ఉండేందుకు మంచి అవకాశంగా మారింది.


Click it and Unblock the Notifications











