RRR 10 Days Collections: 10 రోజుల్లోనే 453 కోట్ల టార్గెట్ ఫినీష్.. అన్ని కోట్ల లాభాలతో 3వ స్థానం

పేరున్న రెండు వేరు వేరు ఫ్యామిలీలకు చెందిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్నారు. తమ తమ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరినీ కలిపి దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం).

ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి.. భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా పది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైప్‌కు అనుగుణంగానే ఈ చిత్రం భారీ స్పందనను దక్కించుకుంది. ఫలితంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దామా!

స్టార్ హీరోలతో రాజమౌళి సినిమా

స్టార్ హీరోలతో రాజమౌళి సినిమా

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇక, ఈ చిత్రంలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించి మెప్పించారు.

ప్రీ బిజినెస్‌లోనూ టాప్ ప్లేస్‌లోనే

ప్రీ బిజినెస్‌లోనూ టాప్ ప్లేస్‌లోనే

క్రేజీ కాంబోలో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ సమాచారం.

10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRR మూవీ ఏపీ, తెలంగాణలో 10వ రోజు బాగా రాణించింది. దీంతో నైజాంలో రూ. 6.96 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.82 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.65 కోట్లు, ఈస్ట్‌లో రూ. 86 లక్షలు, వెస్ట్‌లో రూ. 60 లక్షలు, గుంటూరులో రూ. 85 లక్షలు, కృష్ణాలో రూ. 81 లక్షలు, నెల్లూరులో రూ. 55 లక్షలతో.. 10వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.10 కోట్లు షేర్, రూ. 25.10 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

10 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

10 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి 10 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 97.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 44.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 30.05 కోట్లు, ఈస్ట్‌లో రూ. 13.75 కోట్లు, వెస్ట్‌లో రూ. 11.60 కోట్లు, గుంటూరులో రూ. 16.31 కోట్లు, కృష్ణాలో రూ. 12.98 కోట్లు, నెల్లూరులో రూ. 7.95 కోట్లతో కలిపి రూ. 234.50 కోట్లు షేర్, రూ. 351.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

10 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 234.50 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 37.15 కోట్లు, తమిళనాడులో రూ. 33.70 కోట్లు, కేరళలో రూ. 9.25 కోట్లు, హిందీలో రూ. 91.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 84.20 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ. 496.80 కోట్లు షేర్‌, రూ. 900 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 496.80 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 43.80 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

బాహుబలికి రెండు రెట్లు.. 3వ హిట్

బాహుబలికి రెండు రెట్లు.. 3వ హిట్

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి పదో రోజైన శనివారం భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో కలిసి ఆరోజు ఏకంగా రూ. 16.10 కోట్లు వచ్చాయి. బాహుబలికి మాత్రం కేవలం రూ. 8.55 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే హిట్ స్టేటస్‌ను చేరుకుంది. ఫలితంగా ఈ ఏడాది బంగార్రాజు, డీజే టిల్లు తర్వాత మూడో హిట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X