RRR 11 Days Collections: ఒక్కసారిగా కలెక్షన్లు డౌన్.. ఆ మూవీ కంటే తక్కువ.. మరో రికార్డు నమోదు

బాహుబలి మూవీ నుంచి తెలుగు సినిమా స్థాయి భారీ రేంజ్‌లో పెరిగిన విషయం తెలిసిందే. ఇక, అప్పటి నుంచే ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో బడా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం).

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మల్టీస్టారర్ జోనర్‌లో వచ్చింది. ఇందులో టాలీవుడ్‌లోనే టాప్ స్టార్లుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఆరంభం నుంచే ఈ సినిమా స్థాయి పెరుగుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఈ నేపథ్యంలో RRR 11 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

 రియల్ హీరోల కథతో RRR మూవీ

రియల్ హీరోల కథతో RRR మూవీ

విప్లవ వీరులు అల్లూరి, కొమరం భీం కథల ఆధారంగా.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు.

ప్రీ బిజినెస్‌లోనూ టాప్ ప్లేస్‌లోనే

ప్రీ బిజినెస్‌లోనూ టాప్ ప్లేస్‌లోనే

భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల టాక్.

11వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

11వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRR మూవీ ఏపీ, తెలంగాణలో 11వ రోజు డౌన్ అయింది. దీంతో నైజాంలో రూ. 2.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 95 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్‌లో రూ. 29 లక్షలు, వెస్ట్‌లో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 21 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. 11వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.98 కోట్లు షేర్, రూ. 8 కోట్లు గ్రాస్‌‌ను మాత్రమే రాబట్టింది.

11 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

11 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

11 రోజుల్లోనూ RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 99.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 45.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 30.83 కోట్లు, ఈస్ట్‌లో రూ. 14.04 కోట్లు, వెస్ట్‌లో రూ. 11.79 కోట్లు, గుంటూరులో రూ. 16.52 కోట్లు, కృష్ణాలో రూ. 13.18 కోట్లు, నెల్లూరులో రూ. 8.13 కోట్లతో కలిపి రూ. 239.48 కోట్లు షేర్, రూ. 358.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

11 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 239.48 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 37.75 కోట్లు, తమిళనాడులో రూ. 34.30 కోట్లు, కేరళలో రూ. 9.45 కోట్లు, హిందీలో రూ. 94.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 86.85 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే రూ. 509.48 కోట్లు షేర్‌, రూ. 920 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

క్రేజీ కాంబోలో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 509.48 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 56.48 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
పదకొండో రోజు నమోదైన రికార్డులు

పదకొండో రోజు నమోదైన రికార్డులు

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి పదకొండో రోజైన సోమవారం కలెక్షన్లు తగ్గిపోయాయి. రెండు రాష్ట్రాల్లో కలిసి ఆరోజు కేవలం రూ. 4.98 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇదే ఈ సినిమాకు అత్యల్ప మొత్తం కావడం గమనార్హం. ఇక, 11వ రోజు బాహుబలికి రూ. 6.80 కోట్లు రాగా.. దీనికి దాదాపు రెండు కోట్లు తగ్గాయి. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 500 కోట్లు షేర్‌ను రాబట్టి రికార్డు కొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X