RRR 12 Days Collections: లాభాల పంట పండిస్తున్నా ఆ విషయంలో బాహుబలి2ని బీట్ చేయలేకపోయిందిగా!
తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళులా భావించే రెండు పెద్ద ఫ్యామిలీలకు చెందిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడో ఏమో? రాజమౌళి అనుకున్నదే తడవుగా రూపొందించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). సినిమా ప్రకటించిన నాటి నుంచి ప్రేక్షకులందరూ దృష్టిని మొత్తం కేంద్రీకరించడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా 12 రోజుల్లో ఎంత వసూలు చేసింది అనేది చూద్దామా!

భారీ బడ్జెట్‌తో
జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించగా రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇక వీరు కాకుండా అజయ్ దేవగన్, శ్రేయ, సముద్ర ఖని కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్
ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా మీద అంతకంతకూ పెరుగుతూ వెళ్లడంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకి మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ రేటు పలికింది. ఇలా తెలుగు సహా ఓవర్సీస్ అన్ని ఏరియాలను కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

12వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
RRR మూవీ ఏపీ, తెలంగాణలో 12వ రోజు మంగళవారం నాడు కూడా బాగా రాణించింది. దీంతో నైజాంలో రూ. 2.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్‌లో రూ. 32 లక్షలు, వెస్ట్‌లో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. 12వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.88 కోట్లు షేర్, రూ. 7.85 కోట్లు గ్రాస్ రాబట్టింది.

12 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్ట్
RRR మూవీ 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 101.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 46.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 31.61 కోట్లు, ఈస్ట్‌లో రూ. 14.36 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.00 కోట్లు, గుంటూరులో రూ. 16.77 కోట్లు, కృష్ణాలో రూ. 13.40 కోట్లు, నెల్లూరులో రూ. 8.31 కోట్లతో కలిపి రూ. 244.36 కోట్లు షేర్, రూ. 367.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
12 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 244.36 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్ణాటక రూ. 38.70 కోట్లు, తమిళనాడుకు రూ. 34.90 కోట్లు, కేరళలో రూ. 9.75 కోట్లు, హిందీలో రూ. 97.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 88.70 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లోనే రూ. 521.06 కోట్లు షేర్, రూ. 938.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బాహుబలి2 ని దాటలేక
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి పన్నెండో రోజైన మంగళవారం కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో కలిసి ఆరోజు ఏకంగా రూ. 04.88 కోట్లు తెచ్చుకుంది. అయితే పన్నెండో రోజు విషయంలో మాత్రం బాహుబలి 2ని బీట్ చేయలేకపోయింది. బాహుబలి2కి 5.49 కోట్లు వస్తే ఈ సినిమాకు మాత్రం కేవలం రూ. 04.88 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆ సంగతి పక్కనపెడితే ఈ సినిమా బిజినెస్ ప్రకారం చూస్తే బ్రేక్ ఈవెన్ సాధించి 69 కోట్ల లాభంతో ముందుకు వెళుతోంది. ఇక ఈ సినిమా మరిన్ని రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో?


Click it and Unblock the Notifications











