twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 13 Days Collections: భారీగా పడిన వసూళ్లు.. తొలిసారి భారీ షాక్.. 13 రోజుల్లో లాభాలే అన్ని కోట్లు

    |

    టాలీవుడ్‌ నుంచి రూపొందినప్పటికీ దేశ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలి వంటి భారీ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ మూవీ రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

    ఫలితంగా తారాస్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని.. అత్యధిక బిజినెస్‌ను కూడా జరుపుకుంది. ఇంత భారీతనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, ఈ సినిమాకు 13వ రోజు మాత్రం కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్ల వివరాలు చూద్దాం పదండి!

    రియల్ హీరోల మల్టీస్టారర్ మూవీ

    రియల్ హీరోల మల్టీస్టారర్ మూవీ

    రియల్ హీరోలు అల్లూరి, కొమరం భీం కథల ఆధారంగా.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.

    Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!

    ప్రీ బిజినెస్‌లోనూ టాప్ ప్లేస్‌లోనే

    ప్రీ బిజినెస్‌లోనూ టాప్ ప్లేస్‌లోనే

    క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల బిజినెస్ జరిగింది.

    13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    RRRకు ఏపీ, తెలంగాణలో 13వ రోజు షాక్ తగిలింది. దీంతో నైజాంలో రూ. 1.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 32 లక్షలు, ఈస్ట్‌లో రూ. 18 లక్షలు, వెస్ట్‌లో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో.. 13వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.54 కోట్లు షేర్, రూ. 4 కోట్లు గ్రాస్‌‌ను మాత్రమే రాబట్టింది.

    మరోసారి రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపి మరీ ఆ భాగాన్ని చూపిస్తూ!మరోసారి రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపి మరీ ఆ భాగాన్ని చూపిస్తూ!

    13 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    13 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    13 రోజుల్లోనూ RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 102.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 46.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 31.93 కోట్లు, ఈస్ట్‌లో రూ. 14.54 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.10 కోట్లు, గుంటూరులో రూ. 16.88 కోట్లు, కృష్ణాలో రూ. 13.50 కోట్లు, నెల్లూరులో రూ. 8.41 కోట్లతో కలిపి రూ. 246.90 కోట్లు షేర్, రూ. 371 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Recommended Video

    RRR Movie నాలుగో రోజూ రికార్డ్ కలెక్షన్స్.. సోమవారం సెంటిమెంట్ బ్రేక్ | Filmibeat Telugu
    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    13 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 246.90 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 39.30 కోట్లు, తమిళనాడులో రూ. 35.05 కోట్లు, కేరళలో రూ. 9.85 కోట్లు, హిందీలో రూ. 99.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 90.05 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లోనే రూ. 528.50 కోట్లు షేర్‌, రూ. 951.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    ఎన్టీఆర్, చరణ్ కలయికలో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 528.50 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 75.50 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

    ఆ రికార్డులకు చేరువైన సినిమా

    ఆ రికార్డులకు చేరువైన సినిమా

    RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో యాభై కోట్ల గ్రాస్‌ను రాబడితే 1000 కోట్లు మార్కును చేరుకుంటుంది. అలాగే, 25 కోట్లు షేర్ వసూలు చేస్తే 100 కోట్ల లాభాలను అందుకున్నట్లు అవుతుంది. అలాగే, 72 కోట్లు షేర్ రాబడితే ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్ల షేర్ మార్కును అందుకుంటుంది.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 528.50 Cr Share in 13 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X