RRR 15 Days Collections: మరింత తగ్గిన వసూళ్లు.. మరో ఆల్‌టైం రికార్డు.. ఓవరాల్‌గా మాత్రం దెబ్బే!

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రూపొందిన ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలి ఇండియన్ బాక్సాఫీస్ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు తెరకెక్కించిన చిత్రం కావడంతో పాటు ఇందులో ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో దీని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా దాటిపోయింది. అయితే, మూడో శుక్రవారం మాత్రం ఈ మూవీకి తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో RRR మూవీ 15 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరూ చూడండి!

స్టార్ హీరోలతో రాజమౌళి మ్యాజిక్

స్టార్ హీరోలతో రాజమౌళి మ్యాజిక్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

 అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు


భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల బిజినెస్ జరిగింది.

15వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

15వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRRకు ఏపీ, తెలంగాణలో 15వ రోజు కూడా కలెక్షన్లు తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 78 లక్షలు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్‌లో రూ. 15 లక్షలు, వెస్ట్‌లో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. 15వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.75 కోట్లు షేర్, రూ. 2.85 కోట్లు గ్రాస్‌‌ను మాత్రమే రాబట్టింది.

15 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

15 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు


RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 103.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 47.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 32.44 కోట్లు, ఈస్ట్‌లో రూ. 14.86 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.32 కోట్లు, గుంటూరులో రూ. 17.05 కోట్లు, కృష్ణాలో రూ. 13.64 కోట్లు, నెల్లూరులో రూ. 8.55 కోట్లతో కలిపి రూ. 250.51 కోట్లు షేర్, రూ. 378.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

15 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 250.51 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 40.10 కోట్లు, తమిళనాడులో రూ. 35.60 కోట్లు, కేరళలో రూ. 9.95 కోట్లు, హిందీలో రూ. 104.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 92.35 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లోనే రూ. 541.11 కోట్లు షేర్‌, రూ. 980 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Recommended Video

RRR Movie నాలుగో రోజూ రికార్డ్ కలెక్షన్స్.. సోమవారం సెంటిమెంట్ బ్రేక్ | Filmibeat Telugu
 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 541.11 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 88.11 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు.. ఓవరాల్‌గా

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు.. ఓవరాల్‌గా

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 250.51 కోట్లు షేర్ వచ్చింది. దీంతో వేగంగా ఈ ఘనత సాధించిన మొదటి చిత్రంగా ఇది ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. అయితే, ఓవరాల్‌గా మాత్రం 15వ రోజు దీనికి రూ. 5.90 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. ఇది సినిమా రిలీజ్ అయినప్పటికీ అత్యత్ప కలెక్షన్లు కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X