RRR 16 Days Collections: శనివారం కలెక్షన్లు డబుల్.. 1000 కోట్లతో సంచలనం.. 3వ సినిమాగా రికార్డు

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయిందన్న విషయం తెలిసిందే. దీనికి కారణం మన పరిశ్రమ నుంచి తెరకెక్కిన 'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించడమే. అందుకే దీని తర్వాత ఆ తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రూపకల్పనలో రెండు వారాల క్రితం విడుదలైన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా దాటిపోయింది. ఈ నేపథ్యంలో RRR మూవీ 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

 16వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

16వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

ఏపీ, తెలంగాణలో 16వ రోజు RRRకు కలెక్షన్లు డబుల్ అయ్యాయి. దీంతో నైజాంలో రూ. 1.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్‌లో రూ. 19 లక్షలు, వెస్ట్‌లో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. శనివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.10 కోట్లు షేర్, రూ. 5.10 కోట్లు గ్రాస్‌‌ను రాబట్టింది.

16 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

16 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు


RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 105.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 48.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 32.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.05 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.44 కోట్లు, గుంటూరులో రూ. 17.18 కోట్లు, కృష్ణాలో రూ. 13.76 కోట్లు, నెల్లూరులో రూ. 8.67 కోట్లతో కలిపి రూ. 253.61 కోట్లు షేర్, రూ. 382 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

16 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 253.61 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 40.85 కోట్లు, తమిళనాడులో రూ. 36.15 కోట్లు, కేరళలో రూ. 10.10 కోట్లు, హిందీలో రూ. 108.95 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 93.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 16 రోజుల్లోనే రూ. 551.51 కోట్లు షేర్‌, రూ. 1003 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 16 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 551.51 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 98.51 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

ఇండియాలో మూడో స్థానానికి RRR

ఇండియాలో మూడో స్థానానికి RRR


RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1003 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫలితంగా ఎక్కువ గ్రాస్ సాధించిన చిత్రాల జాబితాలో ఇది మూడో స్థానానికి చేరింది. ఈ లిస్టులో దంగల్ రూ. 1958 కోట్లు, బాహుబలి 2 రూ. 1810 కోట్ల గ్రాస్‌తో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మాత్రం ఇది రెండో స్థానంలో కొనసాగుతోండడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X