RRR 17 Days Collections: కలిసొచ్చిన సండే.. బాహుబలిని దాటి మరీ.. అన్ని కోట్ల లాభాలతో సంచలన రికార్డు
'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ సిరీస్‌తో తన స్టామినాను, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాడు టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి. అంతటి ఘన విజయం తర్వాత ఆయన రూపొందించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ మూవీ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే దీనికి ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఆరంభం నుంచే కలెక్షన్లు పోటెత్తడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా దాటిపోయింది. ఈ నేపథ్యంలో RRR మూవీ 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో మీరూ చూడండి!

ఇద్దరు స్టార్లను కలిపిన రాజమౌళి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
భారీ బడ్జెట్‌తో స్టార్ హీరోల కాంబోలో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల బిజినెస్ జరిగింది.

17వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
ఏపీ, తెలంగాణలో 17వ రోజు RRRకు కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 2.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 68 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్‌లో రూ. 29 లక్షలు, వెస్ట్‌లో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.51 కోట్లు షేర్, రూ. 7 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

17 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 107.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 48.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 33.48 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.34 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.62 కోట్లు, గుంటూరులో రూ. 17.44 కోట్లు, కృష్ణాలో రూ. 14 కోట్లు, నెల్లూరులో రూ. 8.85 కోట్లతో కలిపి రూ. 258.12 కోట్లు షేర్, రూ. 389 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
17 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 258.12 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 41.60 కోట్లు, తమిళనాడులో రూ. 36.75 కోట్లు, కేరళలో రూ. 10.20 కోట్లు, హిందీలో రూ. 114.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 94.80 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లోనే రూ. 564.22 కోట్లు షేర్, రూ. 1029 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 564.22 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 111.21 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

17వ రోజు టాప్.. ఓవరాల్‌గా మూడు
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.51 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా బాహుబలి పేరిట ఉన్న రూ. 4.19 కోట్ల రికార్డును దాటేసింది. అలాగే, ఎక్కువ లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో ఇది (113.42 కోట్లు) మూడో స్థానానికి చేరింది. ఈ లిస్టులో బాహుబలి 2 రూ. 508 కోట్లు, బాహుబలి 1 రూ. 186 కోట్లతో రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











